వైసీపీ చాప్టర్ క్లోజ్…. ఆ పార్టీలో ఏం జరుగుతుంది?
వైసీపీలో నెంబర్ టు. జగన్ తర్వాత ఆ పార్టీకి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ తానే అయ్యి వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఆ పార్టీని వదిలిపెట్టేశారు. రాజ్యసభ సీటు కి కూడా రాజీనామా చేసేశారు. సాయి రెడ్డి బాటలోనే మరి కొంతమంది రాజ్యసభ ఎంపీలు పార్టీని విడబోతున్నారు.
వైసీపీలో నెంబర్ టు. జగన్ తర్వాత ఆ పార్టీకి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ తానే అయ్యి వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఆ పార్టీని వదిలిపెట్టేశారు. రాజ్యసభ సీటు కి కూడా రాజీనామా చేసేశారు. సాయి రెడ్డి బాటలోనే మరి కొంతమంది రాజ్యసభ ఎంపీలు పార్టీని విడబోతున్నారు. వైసీపీలో ఏం జరుగుతుంది?. తొలినాటి నుంచి జగన్ తో ఉన్న సాయి రెడ్డి ఎందుకు ఆ పార్టీని విడిచి పెట్టారు. తెర వెనక ఎవరు చక్రం తిప్పారు? బిజెపి, టిడిపి వేసిన చక్రబంధంలో సాయి రెడ్డి గిలగిల కొట్టుకుంటున్నారా? అందుకే ఆయన రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయారా? అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? డయల్ న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్.
విజయ సాయి రెడ్డి వైసీపీని విడిచి పెట్టడం…. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. కానీ ఈ విషయంలో ఆ పార్టీ అధినేత జగన్ కి మాత్రం ఎప్పుడో ముందస్తు సమాచారం ఉంది. నిజానికి ఏడాదిన్నర నుంచి విజయ్ సాయి రెడ్డి కి జగన్ కి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. వైసీపీకి ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఉన్న సాయి రెడ్డి పార్టీని ఆ మూడు జిల్లాల్లో అతలాకుతలం చేసేశారు. సాయి రెడ్డి సారధ్యంలో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు విశాఖ చుట్టుపక్కల చాలా భూ ఆక్రమణకు పాల్పడ్డారు. పార్టీ పూర్తిగా వెనకబడిపోయింది. ఎన్నికలకు ఏడాది ముందు ఈ విషయాన్ని గుర్తించిన జగన్ ,సాయి రెడ్డి నీ ఉత్తరాంధ్ర పదవి నుంచి తప్పించారు. అప్పటినుంచి సాయన్నకు జగన్కు మధ్య దూరం పెరిగింది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేయడం కూడా విజయ్ సాయిరెడ్డికి ఇష్టం లేదు. జగన్ సాయి రెడ్డిని బలవంతంగా ఎన్నికల్లో దించారు. జగన్ గురించి పూర్తి అవగాహన ఉన్న సాయి రెడ్డి…. ఢిల్లీలో చాలా ప్రాబల్యం సంపాదించారు. ప్రధాని మోడీ నేరుగా సాయి రెడ్డిని చూసి గుర్తుపట్టగలిగేటంత దగ్గరయ్యారు.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ ఏడు నెలల్లో సాయి రెడ్డి కేవలం మూడుసార్లు మాత్రమే జగన్ కలిశారు. ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం జగన్ అమిత్ షా మధ్య భేటీ జరిగింది. అప్పటికే వైసీపీ కి రాజ్యసభలో ఉన్న 11 స్థానాల్లో మూడు చేజారి పోయాయి. బీసీ నేత ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి తన రాజ్యసభ ఎంపీ స్థానాలకు రాజీనామా చేశారు. బీద మస్తాన్ రావు టిడిపి రాజ్యసభ ఎంపీగా ,ఆర్ కృష్ణయ్య బిజెపి రాజ్యసభ ఎంపీగా వెళ్లిపోగా, మోపిదేవి స్థానాన్ని టిడిపి సానా సతీష్ కి కేటాయించింది. మిగిలిన 8 స్థానాలను
బిజెపికి వదిలివేయాలని అమిత్ షా జగన్ నీ కోరినట్లు సమాచారం. కనీసం ఐదు ఎంపీ సీట్లు అయినా బిజెపికి ఇవ్వాలని అమిత్ షా కోరారు. దీనికి జగన్ ససేమిరా అన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో తమ సంఖ్య 11 కి పడిపోయిందని, రాజ్యసభ స్థానాలు కూడా వదులుకుంటే అసలు పార్టీ ఉనికి కె ముప్పొస్తుందని, తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందని అమిత్ షాకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు జగన్. రాజ్యసభ సీట్లు బిజెపికి ఇస్తే జగన్కు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని అమిత్ షా హామీ ఇచ్చినప్పటికీ జగన్ అంగీకరించలేదు. ఆ తర్వాత జగన్ మళ్ళీ ఎప్పుడు షాను కలవలేదు. సాయి రెడ్డి మాత్రం అమిత్ షా తో మూడుసార్లు బేటి అయ్యారు. ఆర్ కృష్ణయ్యను కూడా బిజెపికి తీసుకురావడంలో విజయ సాయి రెడ్డి కీలక పాత్ర పోషించారు. వైసీపీలోనే ఉంటూ మిగిలిన ఎంపీలు అందరితో రాయబారం చేసింది కూడా సాయి రెడ్డి. బిజెపిలోకి వెళ్లాలన్న ప్రతిపాదనకు వై వి సుబ్బారెడ్డి, నిరంజన్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ అంగీకరించలేదు. సాయి రెడ్డి రాజ్యసభ ఎంపీల అందరిని బిజెపికి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అనే సమాచారం జగన్కు ఉంది.
నందమూరి హీరోలతో 800 కోట్లు, ఐటీ రైడ్స్ నుంచి నాగ వంశీ ఎస్కేప్
మరోవైపు సాయి రెడ్డి పై టిడిపి గురి పెట్టింది. విశాఖలో సాయి రెడ్డి ఆయన మనుషులు ఆక్రమించుకున్న భూముల వివరాలు మొత్తం బయటకు వచ్చాయి. అంతేకాకుండా కాకినాడ సేజ్, కాకినాడ పోర్టు విషయంలో సాయి రెడ్డి అక్రమాలపై ఈడికి ఫిర్యాదులు వెళ్లాయి. ఇప్పటికే ఈ కేసులో ఈడి ముందు హాజరు అయ్యారు కూడా సాయి రెడ్డి. విశాఖ లో అవినీతి కేసులు, కాకినాడ పోర్టులో కె.వి రావు పెట్టిన కేసు ఇవన్నీ తనని చెప్పుకుంటున్నాయని సాయి రెడ్డికి అర్థమైంది. అంతేకాదు ఢిల్లీలో లిక్కర్ కేసులోనూ సాయి రెడ్డి కుటుంబ సభ్యులు పీకల్లోతు మునిగిపోయారు. మరోవైపు జగన్తో దూరం కూడా పెరుగుతూనే ఉంది. జగన్ నాలుగైదు సార్లు ఫోన్ చేసినా కూడా సాయి రెడ్డి ఫోన్ ఎత్తలేదు అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత దూరం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. జగన్ ఆర్థిక నేరాల్లో భాగస్వామిగా ఉండి అతనితోపాటు 16 నెలలు జైల్లో కూడా గడిపిన సాయి రెడ్డి…. తనను జగన్ నిర్లక్ష్యం చేస్తున్నాడు అనే భావంతో కుమిలిపోయినట్లు సమాచారం. సజ్జల రామకృష్ణారెడ్డికి, సుబ్బారెడ్డి కి ఇస్తున్న ప్రాధాన్యాన్ని తనకు ఇవ్వడం లేదని, తనని క్రిమినల్ రామ్ చూస్తున్నాడని సన్నిహితులు ఒకరి దగ్గర సాయి రెడ్డి వాపోయాడట. ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి తో అక్రమ సంబంధం కేసులో పార్టీ నుంచి ఒక్కరు కూడా తనకు మద్దతు ఇవ్వకపోవడం…. మీడియా తనను కుల్లబడుస్తుంటే కనీసం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సాయి రెడ్డి నీ చాలా ఆవేదన గురిచేసింది. సాయి రెడ్డికి మరో సన్నిహితులైన జివిడి కృష్ణమోహన్ ను జగన్ కోటరీ పార్టీ నుంచి బయటకు పంపించింది. వీటన్నిటిని సాయి రెడ్డి విశ్లేషించుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన రాజ్యసభ స్థానాన్ని బిజెపి వదులుకొని కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిదని భావించాడు. జగన్ లండన్ వెళ్ళగానే బిజెపి పెద్దలతో మరోసారి సమావేశం అయ్యాడు. బెంగళూరులో బిజెపి నేత మాజీ సీఎం యడ్యూరప్పను కూడా కలిశాడు. రాజీనామా చేయడంతో పాటు రాజ్యసభ స్థానాన్ని కూడా వదులుకుంటున్నట్టు ప్రకటించేసాడు.
సాయి రెడ్డి వైసీపీని వీడ్తాడని సమాచారం జగన్ కే కాదు…. టిడిపి అధినేత చంద్రబాబు కూడా ఉంది. అందుకే సాయి రెడ్డి తన చివరి ట్వీట్ లో చంద్రబాబుతో తనకి ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని, పవన్ కళ్యాణ్ తనకు చాలా సన్నిహిత మిత్రుడని చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద వైయస్ కుటుంబంతో ఇన్నేళ్ల అనుబంధాన్ని సాయి రెడ్డి తెంచేసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని వ్యవసాయం చేసుకుంటానని సాయి రెడ్డి చెప్పినప్పటికీ….. ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ కావాలన్నది ఆయన కోరిక. మరి సాయి రెడ్డి కోరికని బిజెపి తీరుస్తుందా లేదా అన్నది చూడాలి. విజయ్ సాయి రెడ్డి బాటలోనే మరో నలుగురు వైసీపీ రాజ్యసభ ఎంపీలు కూడా పదవులకు రాజీనామా చేయబోతున్నారు. ఈ పరిస్థితుల్లో మౌనంగా ఉండటం తప్ప జగన్ చేయగలిగేది ఏమీ లేదు.