మా నాన్నను చంపేస్తారు: గౌతం రెడ్డి కుమార్తె
విజయవాడ వైసీపీ నేత గౌతం రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్న నేపధ్యంలో.. వైసీపీ సీనియర్ నేతలు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
విజయవాడ వైసీపీ నేత గౌతం రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్న నేపధ్యంలో.. వైసీపీ సీనియర్ నేతలు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె లిఖిత మీడియాతో మాట్లాడారు. నా తండ్రి పారిపోలేదు ప్రాణభయంతో ఎక్కడో తలదాచుకున్నారని పేర్కొన్నారు. 24 లక్షల రూపాయల సుపారీ ఇచ్చారు అన్నది పచ్చి అబద్ధం అని స్పష్టం చేసారు. ఈ కేసుపై యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేశానన్న ఆమె… పోలీసులు దొంగల్లా మా ఇంట్లోకి చొరబడ్డారని మండిపడ్డారు.
ఎవరూ లేని సమయంలో 66 ఏళ్ల నా తల్లి ని తీవ్ర ఇబ్బందికి గురి చేశారని… నా తండ్రిపై 42 కేసులు ఉన్నాయి అంటున్నారు నిరూపించమనండి అంటూ సవాల్ చేసారు. ఈ కేసు ఇప్పటిది కాదు,ఎన్నో ఏళ్ల నుండి కోర్టులో నడుస్తోందన్నారు. నిజంగా దాడి చేయించాలంటే మా ప్రభుత్వంలోనే చేపించి ఉండే వాళ్ళమన్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడే కోర్టులు చుట్టూ తిరిగిన వాళ్ళమని తెలిపిన ఆమె ఈ ప్రభుత్వంలో కావాలని ఎందుకు దాడులు చేయిస్తాము…? అంటూ ప్రశ్నించారు.