బట్టలూడదీసి కొడతా, పోలీసులపై వైసీపీ నేత ఫైర్
అధికారంలో నుంచి దిగిపోయినా వైసీపీ నేతలలో మాత్రం పోలీసులను బెదిరించే పద్ధతుల్లో మాత్రం మార్పు రావడం లేదు. పదే పదే పోలీసులను బెదిరించడం వారికి వార్నింగ్లు ఘాటుగా ఇవ్వటం కామన్ గా మారిపోయింది.
అధికారంలో నుంచి దిగిపోయినా వైసీపీ నేతలలో మాత్రం పోలీసులను బెదిరించే పద్ధతుల్లో మాత్రం మార్పు రావడం లేదు. పదే పదే పోలీసులను బెదిరించడం వారికి వార్నింగ్లు ఘాటుగా ఇవ్వటం కామన్ గా మారిపోయింది. తమను ఇబ్బంది పెట్టారు అనే కారణంతో పోలీసులకు హెచ్చరికలు పంపిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసిపి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలాగే ఓవరాక్షన్ చేస్తే పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా కావలి వన్ టౌన్ పోలీస్ లు ఆయనపై కేసు నమోదు చేయడం సెన్సేషన్ అయింది.
ఇటీవల బోగోలు మండలం కోళ్లదిన్నె టిడిపి అలాగే వైసిపి వర్గీయులు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు వర్గాల వారు తీవ్రంగా గాయపడటంతో వారిని కావలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక వైసిపి నేతలను పరామర్శించేందుకు ఆసుపత్రి వద్దకు కాకాని వెళ్లారు. ఈ సందర్భంగా కాకాని పోలీసులను అలాగే టిడిపి నేతలు ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిడిపి కార్యకర్తలు తమ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని ఆరోపిస్తూ రాబోయేది కచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే అని.. పోలీసు అధికారులు సప్త సముద్రాలు అవతల ఉన్నా తీసుకొచ్చి బట్టలు ఊడదీస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీనిపై టిడిపి నేత వంటేరు ప్రసన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాకానిపై సెక్షన్ 254, 351/2 352/2 353/2 కింద కేసు నమోదు చేశారు. ఇక మహిళపై జరిగిన అత్యాచారం కేసులో కూడా పోలీసులపై మాజీ మంత్రి ఇలాగే దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఓ విద్యుత్ లైన్మెన్ చనిపోతే అతని భార్యకు ఆ ఉద్యోగం ఇప్పిస్తానంటూ కాకాని అనుచరుడు శేషయ్య.. పలుమార్లు ఆమెపై లైంగిక దాడులకు దిగాడని ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగం వచ్చిన తర్వాత మహిళను వేధిస్తుండటంతో తట్టుకోలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కాకాని అనుచరుడిపై పోలీసులు కేసు నమోదు చేయగా ఈ వ్యవహారంలో కూడా పోలీసులు అలాగే రెవెన్యూ అధికారులను కాకాని భయపెట్టే ప్రయత్నం చేశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత తాను అంతు చూస్తాను అంటూ వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు అలాగే ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారని సిఐ సుబ్బారావు ఆర్ ఐ రవిని కాకాని స్వయంగా బెదిరించడం సెన్సేషన్ అయింది. సీఐ అలాగే ఆర్ ఐ శాశ్వతంగా ఉద్యోగం చేయకుండా చర్యలు తీసుకుంటానంటూ బెదిరింపులకు దిగడం సంచలనమైంది ఇలా ప్రభుత్వాధికారులను పదేపదే కాకాని టార్గెట్ చేయడంతో ఆయనపై పోలీసులు కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే కాకానిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.