చంద్రబాబుకు జగన్ కొత్త బిరుదు
ప్రజలను మభ్యపెట్టేందుకే బడ్జెట్ అని విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. హామీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు అని ఆయన ఆరోపించారు.

ప్రజలను మభ్యపెట్టేందుకే బడ్జెట్ అని విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. హామీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు అని ఆయన ఆరోపించారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో 4 నెలలు మాత్రమే ఉందన్న ఆయన వాళ్ల మోసాలు, అబద్ధాలు బయటకు వస్తాయనే.. ఇంతకాలం బడ్జెట్ పెట్టలేదని విమర్శించారు. సాకులు చెబుతూ బడ్జెట్‌పై కాలయాపన చేశారు అని విమర్శించారు. మా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారన్నారు జగన్.
పరిమితికి మించి అప్పులు చేసినట్టు ప్రచారం చేశారనన్నారు. అప్పులు చేయడం.. పథకాలు ఇవ్వడం సర్వసాధారణమే అని తెలిపిన ఆయన చంద్రబాబు ఒక అబద్దం సృష్టిస్తే దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని జగన్ ఆరోపించారు. అప్పుల విషయంలో ఏపీ శ్రీలంక అయిపోతుందని మాట్లాడారని అవే వ్యాఖ్యలు దత్త పుత్రుడితో చేయిస్తారు అంటూ జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు అప్పు రత్న బిరుదు ఇవ్వాలన్నారు జగన్.