గప్ చుప్.. మైకులు కనపడితే పారిపోతున్న వైసీపీ లీడర్లు
ఏపీలో రాజకీయం చాలా వేగంగా మారుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేసిన కొంతమంది వైసిపి నాయకులు.. సైలెంట్ అయిపోతున్నారు.

ఏపీలో రాజకీయం చాలా వేగంగా మారుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేసిన కొంతమంది వైసిపి నాయకులు.. సైలెంట్ అయిపోతున్నారు. అనవసరంగా తమను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అని… భావిస్తున్న కొంతమంది నాయకులు చాలా జాగ్రత్తగా… తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ భవిష్యత్తు కంటే వ్యక్తిగత జీవితం ముఖ్యమని…. తమ వ్యక్తిగత భవిష్యత్తు కీలకమని భావిస్తున్న కొంతమంది నాయకులు సైలెంట్ అయిపోవడమే మంచిది అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గట్టిగా మాట్లాడిన చాలామంది నాయకులు… ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కొంతమంది నాయకులు మాత్రమే అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. అందులో మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజిని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు… వంటి వారు అప్పుడప్పుడు మాట్లాడే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో… వాళ్లు సైలెంట్ అయిపోయినట్లే తెలుస్తోంది.
మొన్నటి వరకు అంబటి రాంబాబు గట్టిగా మాట్లాడారు. పోసాని కృష్ణమురళి… వల్లభనేని వంశీ మోహన్ ను అరెస్టు చేసిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. ఇక ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు… కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. అప్పుడప్పుడు ఆయన మీడియాలో కనపడినా… ఇప్పుడు మాత్రం మీడియాతో మాట్లాడే మాటలను చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన డిసైడ్ అయినట్లుగానే తెలుస్తుంది. తాజాగా మీడియాతో చాలా తక్కువగా మాట్లాడారు అప్పలరాజు.
ఇక విడదల రజిని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి… టిడిపి నేతలకు వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఆమెపై ఉన్న అవినీతి ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం బయటికి తీస్తోంది. దీనితో విడదల రజిని మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదు. అలాగే కురసాల కన్నబాబు… కూడా విజయవాడకు దూరంగా ఉంటున్నారు. అవసరమైతే నియోజకవర్గానికి కూడా ఆయన దూరంగా ఉండటమే మంచిదనే అభిప్రాయంలో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఎక్కువగా హైదరాబాదులోనే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆర్కే రోజా కూడా ఇటీవల కాలంలో పెద్దగా బయటకు వచ్చిన పరిస్థితి లేదనే చెప్పాలి. ఎక్కువగా తిరుమల వెళ్లే రోజా… ఇప్పుడు మాత్రం కాస్త సైలెంట్ గానే ఉండటం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు అర్థమవుతుంది. తమపై ఉన్న కేసులను బయటకు లాగే అవకాశం ఉండటంతో జాగ్రత్త పడుతున్నారు మాజీ మంత్రులు. ఇక మాజీ ఎమ్మెల్యేలు కూడా… కొంతమంది అప్పట్లో సందడి చేసినా… పోసాని కృష్ణ మురళి అరెస్టు తర్వాత దెబ్బకు సైలెంట్ అయిపోయారు. ఇక వైసీపీలో కీలక నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా బయటకు రావటం లేదు. ఆయనపై కూడా పలు కేసులను రాష్ట్ర ప్రభుత్వం బయటికి తీసే ప్రయత్నం చేస్తుంది. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి తనను తాను కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.