వైసీపీ కార్యకర్తను పట్టించిన అంబటి…
ఏపీ వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా నకరికళ్ళు మండలం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా నకరికళ్ళు మండలం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజి మంత్రి అంబటి రాంబాబు ఆఫీసు కి వచ్చి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్ట్ కు ముందు అంబటి రాంబాబు పోలీసులకు సవాల్ చేసారు. రాజశేఖర్ రెడ్డి తన వద్దనే ఉన్నాడని దమ్ము ఉంటే అరెస్ట్ చేయాలని సవాల్ చేసారు.
అతని కోసం నాలుగు రోజుల నుంచి గాలిస్తున్న పోలీసులు… వెంటనే అంబటి కార్యాలయానికి చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ… రాజశేఖర్ రెడ్డి కోసం 4 రోజుల నుండి పోలీసులు వెతుకుతున్నారని చట్ట ప్రకారం ఏ స్టేషన్లో కేసు నమోదు చేశారో చూపించి తీసుకు వెళ్ళండి అని చెప్పామని పేర్కొన్నారు. 10:30 నిమిషాలకు నా ఆఫీసు కి వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని ఆయన ఆరోపించారు. పోలీసులు కొన్ని చోట్ల రౌడీ లు గా మారి వైసీపీ కార్యకర్తలను కొడుతున్నారని మండిపడ్డారు.
సీతారామంజనేయులు అనే వ్యక్తి 9 వతేదీన మా కార్యకర్త పై పొలిసులకు ఫిర్యాదు చేశాడని హోంమంత్రి అనిత పై అసభ్యకరంగా పోస్ట్ లు పెట్టాడని కేసు పెట్టారని తెలిపారు. టీడీపీ కి చెందిన నాయకుడు సీతారామంజనేయులు వైసీపీ కార్యకర్త పై ఫిర్యాదు చేశాడని… వైసీపీ నాయకుల పై అసభ్యకరంగా పోస్ట్ లు పెట్టిన వారి పై చర్యలు లేవని ఆరోపించారు. నా పై నా కుటుంబ సభ్యుల పై అసభ్య పద జాలంతో పోస్ట్ లు పెట్టారన్నారు అంబటి. టీడీపీ కి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయరు అని నిలదీశారు.