ఇదేం డ్రామా కంపెనీ రా.! పిల్లల్ని కూడా వదలరా.?
వైసీపీ సోషల్ మీడియా...ఏం మారలేదు. పేటీఎం బ్యాచ్ అని మరోసారి నిరూపించుకుంది. అటువైపు కూటమి ప్రభుత్వం. అందులోనూ తెలుగుదేశం పార్టీ ఉందక్కడ.

వైసీపీ సోషల్ మీడియా…ఏం మారలేదు. పేటీఎం బ్యాచ్ అని మరోసారి నిరూపించుకుంది. అటువైపు కూటమి ప్రభుత్వం. అందులోనూ తెలుగుదేశం పార్టీ ఉందక్కడ. ఆ పార్టీ సోషల్ మీడియా మాములుగా ఉండదు. ప్రత్యర్థులు దొరికితే చాలు..చెడుగుడు ఆడుకోవడానికి కాచుకొని కూర్చొని ఉంటారు. అలాంటపుడు వైసీపీ ఎలా ఉండాలి. వేసే ప్రతి అడుగు జాగ్రతగా వేయాలి. తీసుకునే ప్రతి నిర్ణయం…ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. దెబ్బ కొడితే మాములుగా ఉండకూడదు. ఈ మధ్య వైసీపీ, ఆ పార్టీ సోషల్ మీడియా…ఏది చేసిన కూటమి ప్రభుత్వానికి అడ్డంగా దొరికిపోతుంది. చేజేతులా పరువు తీసుకుంటోంది. అధికారంలో ఉన్నపుడు చేసిన తప్పులను రిపీట్ చేస్తోంది. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించాల్సిన వైసీపీ..కూటమి ప్రభుత్వం చేతికి చిక్కుతూనే ఉంది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి…విజయవాడకు వచ్చారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించి…తిరుగుముఖం పట్టారు. కాన్వాయ్ లో వెళ్తు.. జనానికి అభివాదం చేస్తూ వెళ్లారు. ఓ బాలిక వైఎస్ జగన్ చూసి ఎమోషనల్ అయ్యింది. అన్నా.. జగనన్నా.. అన్న ఫ్లీజ్ అన్న…ఒక్కసారి చేయి చాచన్నా..ఒక్కసారిగా నీ దగ్గరకు రావాలంటూ కేకలు వేస్తూ అరిచింది. బాలికను గమనించిన వైఎస్ జగన్…వెంటనే కాన్వాయ్ ను ఆపారు. పాపను ప్రేమతో తన దగ్గరకు తీసుకున్నారు. ఆమె నుదుడి మీద ముద్దు పెట్టి, ఆశీర్వదించారు. జగన్ అన్న ముద్దు చేయడంతో…చిన్నారి ఆనందానికి అవధాలు లేకుండా పోయాయి. చిన్నారి సైతం జగన్ అన్నకి ముద్దుపెట్టింది. ప్రేమతో సెల్ఫీ కూడా దిగింది. సంతోషంతో ఉప్పొంగిపోయిన పాప ఏడుస్తూనే…జగన్ ప్రయాణిస్తున్న వాహనం నుంచి దిగింది. జగన్ చేసిన ఈ పనిని చూసిన వారంతా…ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక్కడి వరకు వైసీపీ పేటీఎం బ్యాచ్…కథ బాగానే రక్తికట్టించింది. జనం కూడా నిజంగానే…జగనన్నకు పాప మీద ప్రేమ ఉంది అని నమ్మారు. ఆ తర్వాతే తెలిసింది. అది వైసీపీ, ఆ పార్టీ సోషల్ మీడియా చేసిన ప్రీప్లాన్ స్క్రిప్ట్. ఎందుకంటే…పాపకు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం, ప్రేమ ఉండటం తప్పు కాదు. ఆయన్ను ప్రశంసించడం నేరమూ కాదు. జగన్ కలిసి…ఫోటోలు దిగిన తర్వాత సైలెంట్ గా ఇంటికి వెళ్లిపోయింటే బాగుండేది. పోని జగన్ గురించి మాత్రమే మీడియాలో మాట్లాడి ఉంటే ఇంకా మంచిదయ్యేది. కానీ ఈ జన్మకు ఇది చాలని.. జగన్ అన్న సీఎంగా ఉన్నప్పుడు అన్ని పథకాలు వచ్చేవని చెప్పడంతో అనే ప్రశ్నలు వచ్చాయి. అంతే ప్రస్తుతం ఏ పథకం రావడం లేదని…తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాలిక చెప్పింది.
అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక…తమ అమ్మఒడి రావడం లేదని వ్యాఖ్యనించడంతో అడ్డంగా బుక్కయిపోయింది. జగన్ మీద అభిమానం ఉంటే…అంత వరకు ఉండాలి కానీ…ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించినట్లు. వైసీపీ బ్యాచ్ ముందే ట్రైనింగ్ ఇవ్వకపోతే…ప్రభుత్వ పథకాలపై అంత అనర్గళంగా ఎలా మాట్లాడింది ? వైసీపీ పేటీఎం బ్యాచ్ జనం చెవిలో పూలు పెడితే నమ్మాలా ? అటూ కూటమి పార్టీల ప్రశ్నిస్తున్నాయి. అన్నన్నా…జగనన్న…ఎంత పని చేశావన్నా…చేసే పని కరెక్ట్ గా చేయి…పేటీఎం బ్యాచ్ ను నమ్ముకొని అడ్డంగా బుక్కవుతున్నావంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అన్నకు 11 సీట్లు ఊరకే రాలేదు…ఫోటో కోసం ఎడ్చినంత వరకు ఓకే…అమ్మఒడి అంది అక్కడే దొరికిపోయిందిగా అంటూ పోస్టులు పెడుతున్నారు.