ఆ ఒక్క కారణంతో మీడియాకు దూరమైన ఏచూరి
సీతారాం ఏచూరి మరణం.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఓ తీరని లోటు. ఆయన లాంటి బహుబాషా ప్రావీణ్యులు ఆ పార్టీకి దూరమవ్వడం దురదృష్టకరమని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు.
సీతారాం ఏచూరి మరణం.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఓ తీరని లోటు. ఆయన లాంటి బహుబాషా ప్రావీణ్యులు ఆ పార్టీకి దూరమవ్వడం దురదృష్టకరమని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు మీడియా ఎంత అవసరమో.. మీడియాతో వాళ్ల జీవితాలకు ఎలాంటి అనుబంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ జాతీయ స్థాయి నేత అయ్యుండి కూడా.. సీతారం అసలు న్యూస్ ఛానల్స్ చూసేవారు కాదట.
పేపర్స్‌కు కూడా పెద్దగా ప్రియార్టీ ఇచ్చేవారు కాదట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకప్పుడు మీడియాలు ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రజల పక్షాన ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతీ ఛానల్ ఏదో ఒక పార్టీకి కొమ్ముకాస్తోంది అనేది ఏచూరి అభిప్రాయం. జర్నలిజం విలువల్ని వదిలేసి చాలా ఛానల్స్ తమకు అనుకూల పార్టీలకు భజనం చేయడం మొదలు పెట్టాయని చెప్పారు ఏచూరి. చాలా వరకు పత్రికలు కూడా ఇదే పంథాలో నడుస్తున్నాయని చెప్పారు ఈ కారణంగానే తాను న్యూస్ ఛానల్స్ చూడటమే మానేనని చెప్పారు. మీడియాకు దూరంగా ఉండే ఏచూరి సినిమాలు మాత్రం బాగా చూసేవారట.
ముఖ్యంగా హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా చూసేవారట. అధ్యాత్మికతకు మతానికి జరిగే యుద్ధంలో ఎప్పుడూ ఆధ్యాత్మికత వైపే నిలిచారు ఏచూరి. స్పిరిచువాలిటీకి మతానికి సంబంధం లేదు.. ఆ రెండు వేరే వేరు అంశాలు అనేది ఏచూరి వాదన. చివరి శ్వాస వరకూ కూడా ఆయన ఇదే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. ఒకవేళ తాను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే.. ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గానో.. లేక పొలిటికల్ విద్యావేత్తగానే మిగిలిపోయేవారట. కానీ రాజకీయాల మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో జేఎన్‌యూలో చదువుతున్న సమయంలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి జాతీయ నేతగా ఎదిగి ఈ స్థాయికి వచ్చారు. అలాంటి సీనియర్ నేత మృతి చాలా మందిలో విషాదాన్ని నింపింది. జాస్థాయిలో ఆయనకు ఉన్న రాజకీయ మిత్రులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఏచూరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.