Telangana Elections : నిన్న పొంగులేటి.. ఇవాళ వివేక్.. కాంగ్రెస్ అభ్యర్థులపై ఐటీ వేట..
ఎన్నికల వేళ.. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఐటీ వేట కొనసాగుతోంది. పాలేరు బరిలో నిలిచిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ వేసే రోజే ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. పొంగులేటి ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు.
ఎన్నికల వేళ.. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఐటీ వేట కొనసాగుతోంది. పాలేరు బరిలో నిలిచిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ వేసే రోజే ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. పొంగులేటి ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి ఈ మధ్యే కాంగ్రెస్‌లో చేరి.. ఎన్నికల బరిలో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్న వివేక్ వెంకటస్వామి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేయడం కొత్త చర్చకు కారణం అవుతోంది. సూట్‌కేస్ కంపెనీలు పెట్టి వివేక్ భారీ మొత్తంలో డబ్బులు చెలామణి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఒక సూట్‌కేస్ కంపెనీకి 8 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు ఫిర్యాదులో తెలిపారు.
Wanaparthi : వనపర్తి లో రేవంత్ రెడ్డి భారీ సభ.. నిరంజన్ రెడ్డి పై సెటైర్లు వేసిన టీపీసీసీ రేవంత్
దీంతో హైదరాబాద్‌తో పాటు చెన్నూరులో వివేక్ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు వివేక్, ఆయన సోదరుడు వినోద్ నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ రైడ్ జరిగింది. వివేక్ ఇళ్లతో పాటు.. కొమ్రం భీమ్ జిల్లాలోని పలు పలు జిన్నింగ్ మిల్లుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 40కి పైగా వాహనాల్లో సోదాలకు బయల్దేరిన అధికారులు.. వరుస దాడులు నిర్వహిస్తున్నారు. మిగతా ప్రాంతాల సంగతి ఎలా ఉన్నా.. ఎన్నికల వేళ కేవలం కాంగ్రెస్ అభ్యర్థులపై ఐటీ సోదాలు చేస్తున్నారని.. బీఆర్ఎస్, బీజేపీ మఘ్య అవగాహన ఉందనే ప్రచారం నిజం అనడానికి ఇదే ఎగ్జాంపుల్ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అటు కాంగ్రెస్ కూడా ఇదే నినాదాన్ని అందుకుంది. తమ పార్టీ బలపడడాన్ని చూసి.. ఆ రెండు పార్టీలు భయపడుతున్నాయని.. అందుకే ఐటీని ఉసిగొల్పుతున్నాయని ఘాటు విమర్శలు చేస్తున్నారు