Telangana Elections : నిన్న టీడీపీ.. ఇవాళ షర్మిల.. రెండు పార్టీల ఓటర్లు ఎటు వైపు..?
ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తున్నా.. ఆ మూడింట్లో కాకుండా మిగతా పార్టీల్లో జరుగుతున్న పరిణామాలు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి. దీంతో ఇతర పార్టీల హడావుడి మాములుగా కనిపించడం లేదు. జనసేన కూడా ఎన్నికల బరిలో నిలుస్తుంటే.. కాంగ్రెస్‌తో పొత్తు ఊహించుకొని లెఫ్ట్ పార్టీలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.
( Telangana elections ) ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. ( BRS )బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తున్నా.. ఆ మూడింట్లో కాకుండా మిగతా పార్టీల్లో జరుగుతున్న పరిణామాలు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి. దీంతో ఇతర పార్టీల హడావుడి మాములుగా కనిపించడం లేదు. జనసేన కూడా ఎన్నికల బరిలో నిలుస్తుంటే.. కాంగ్రెస్‌తో పొత్తు ఊహించుకొని లెఫ్ట్ పార్టీలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. రెండు పార్టీలు తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నాయి.
http://ఆటలో అరటిపండులా షర్మిల.. పోటీకి తప్పుకోవడం వెనక ఇంత ప్లాన్ ఉందా..?
ఇదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయ్. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని టీడీపీ ఇప్పటికే అనౌన్స్ చేయగా.. వైటీపీ అధ్యక్షురాలు కూడా పోటీలో ఉండమని తేల్చి చెప్పేశారు. నిన్న మొన్నటి వరకు రేసులో ఉండి.. ఇప్పుడు అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్న ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకు ఎటు వైపు మళ్లుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో టీడీపీ ప్రభావం ఖమ్మం, నల్గొండ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఉంది. దీంతో టీడీపీ సానుభూతి పరులంతా అధికార బీఆర్ఎస్ వైపు వెళ్లే చాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
http://చేరికలు… బుజ్జగింపులు.. ! కాంగ్రెస్ ఫటా ఫట్ ప్లాన్ ..!!
ఇకపోతే ఎన్నికల నుంచి తప్పుకున్న ( YCP ) వైటీపీకి ఎంతో కొంత ఆదరణ ఉంది. వైఎస్ఆర్ అభిమానులు, సానుభూతిపరులు ఆ జిల్లాల్లోనే ఉన్నారు. వారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉంది. స్వయంగా షర్మిల కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడంతో.. ఆమె పార్టీకి మద్దతు పలికే ఓటర్లంత కాంగ్రెస్‌కు గంపగుత్తున ఓటేసే అవకాశం ఉంది. దీంతో ఓటు బ్యాంక్ చీలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి వీళ్లంతా ఎవరి దారి వారు చూసుకుంటే.. అది ఏ పార్టీకి లాభం చేస్తుంది.. ఏ పార్టీకి నష్టం చేస్తుంది.. రెండు పార్టీలు వదులుకున్న ఓటర్లు.. ఓ పార్టీని అధికారంలో నిలబెడతారు అనే ఎనాలిసిస్ సామాన్య జనాల్లో వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. ( BRS Vs Congress )బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఆ రెండు పార్టీల ఓటర్లు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.