మీరు కొట్టుకోవాల.. నేను రెచ్చిపోవాల ఇదేనా నెతన్యాహు సైలెంట్ యాక్షన్?
ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు.. ఖమేనీ దేనికైనా రెఢీ అంటున్నారు.. నెతన్యాహు సైలెంట్‌గా పావులు కదుపుతున్నారు.. ఈ ముగ్గురి యాక్షన్‌తో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పు డైనా యుద్ధం అనేలా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.

ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు.. ఖమేనీ దేనికైనా రెఢీ అంటున్నారు.. నెతన్యాహు సైలెంట్‌గా పావులు కదుపుతున్నారు.. ఈ ముగ్గురి యాక్షన్‌తో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పు డైనా యుద్ధం అనేలా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఒకే ఒక్క సంతకంతో ముగియాల్సిన రచ్చ.. వందల మిస్సైళ్లను సిద్ధం చేసుకునే వరకూ వెళ్లింది. ఈ ముగ్గురిలో ఒక్కరు గీత దాటినా మహా విధ్వంసా నికి రంగం సిద్ధమైనట్టే అని విశ్లేషకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ, అణు నిరాయుధీ కరణ ఒప్పందం చుట్టు అసలేం జరుగుతోంది? అమెరికా, ఇరాన్ మాటల యుద్ధం ఎటు టర్న్ కాబోతోంది?అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలను ఇజ్రాయెల్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉందా? టాప్ స్టోరీలో చూద్దాం..
మిడిల్ ఈస్ట్‌లో ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలియాలంటే 2015 నాటి ఒక ఒప్పందం గురిం చి తెలుసుకోవాలి. అణ్వాయుధ అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేస్తామని 2015లో అమెరికా సహా వివిధ దేశాలతో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకుంది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై పరిమితులు పాటిస్తామని అంగీకరించింది. దీనికి బదులుగా ఇరాన్‌పై విధించిన ఆంక్షల్ని ఆయా దేశాలు ఎత్తివేశాయి.
అయితే, ఇరాన్ నిబంధనలను పాటించడం లేదని ఆరోపిస్తూ 2018లో అమెరికా నాటి అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలిగారు. ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధించారు. దీనికి ప్రతిగా ఇరాన్ మళ్లీ అణు శుద్ధి కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. 2021 జనవరిలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన బైడెన్.. ఈ ఒప్పందంలోకి తిరిగి ప్రవేశించటం తనకు ప్రాధాన్య అంశమని స్పష్టం చేశారు. ఐతే తొలుత ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ షరతు పెట్టింది. దీనిపై రెండుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ గ్యాప్‌లో ఇరాన్ అణ్వాయుధాల తయారీ దిశగా వేగంగా అడుగులేయడం మొదలు పెట్టింది. కొన్ని నివేదికలు ఆల్రెడీ టెహ్రాన్ అణ్వస్త్ర తయారీకి చేరువైందని చెబుతున్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలోనే ట్రంప్ మళ్లీ వైట్‌హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. రావడంతోనే ఇరాన్‌ను టార్గెట్ చేశారు. ఆ లక్ష్యం దిశగా ఇటీవల యాక్షన్ మార్చేశారు.
ఇటీవల అణు నిరాయుధీకరణ ఒప్పందంపై చర్చిద్దామంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి ట్రంప్ లేఖ రాశారు. అయితే, నేరుగా అగ్రరాజ్యంతో చర్చలు జరపబోమని టెహ్రాన్ స్పష్టం చేసింది. పరోక్ష చర్చలకు సిద్ధమని పేర్కొంది. ట్రంప్ లేఖపై రియాక్ట్ అయిన ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్.. అగ్రరాజ్యంతో నేరుగా జరిపే చర్చలను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. పరోక్ష మార్గంలో చర్చ జరిపేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇది ట్రంప్ ఇగోను దారుణంగా హర్ట్ చేసింది. దీంతో టెహ్రాన్‌పై బెదిరింపులకు దిగారు. ఒకవేళ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్ నిరాకరిస్తే.. బాంబు దాడులు తప్పవనీ.. ఆ దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయన్నారు. అదే విధంగా మరో విడత ఆంక్షలు ఎదుర్కోవా ల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ఈ రేంజ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత.. టెహ్రాన్ మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది? ఊహించిన దానికంటే వైల్డ్‌గా రియాక్ట్ అయింది.
తమపై దాడి చేస్తే అమెరికా చేసిన అతిపెద్ద తప్పు అదే అవుతుందని ఖమేనీ హెచ్చరించారు. అంతేకాదు, టెహ్రాన్‌పై దాడి జరిగితే ప్రతిదాడులు చేయడానికి ఇరాన్ సిద్ధమైంది. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న భూగర్భ ప్రయోగ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో క్షిపణుల్ని లాంచ్‌ప్యాడ్‌లపై సిద్ధంగా పెట్టినట్లు టెహ్రాన్ టైమ్స్ కథనం తెలిపింది. ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదురైతే అమెరికా సంబంధిత ప్రాంతాలపై దాడులు చేసేందుకు వీటిని ఉపయోగించనున్నట్లు టెహ్రాన్ టైమ్స్ పేర్కొంది. మధ్యప్రాఛ్యంలో అమెరికా సైనిక స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న క్షిపణులను ఉంచిన సొరంగాలను ‘ది ఇరాన్ అబ్జర్వర్ సంస్థ పోస్టు చేసింది. మరోవైపు అమెరికా సైనిక చర్య విస్తృత సంఘర్షణకు దారితీ స్తుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ అన్నారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తే, అది గన్‌పౌడర్ డిపోలో నిప్పురవ్వగా మారుతుందని హెచ్చరించారు. సో.. అగ్రరాజ్యంతో చర్చలకంటే కూడా యుద్ధానికే టెహ్రాన్ సిద్ధంగా ఉందనడానికి ఈ యాక్షన్ సరిపోతుంది. అయితే, అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలను ఒకరు నిశితంగా పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి ఒక సిట్యువేషన్ కోసం అతడు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు. అతడే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు..! ట్రంప్, ఖమేనీల్లో ఎవరు గీత దాటినా యాక్షన్‌లోకి దిగాలనేది అతడి ప్లాన్.
ఇజ్రాయెల్‌కు హమాస్, హిజ్బుల్లా, హౌతీలతోనే సమస్య. ఈ మూడు గ్రూపులు లేకపోతే ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉంటుంది. కానీ, ఇరాన్ ఉన్నంతవరకూ ఆ మూడు గ్రూపులూ అంతం కావు. ఎందుకంటే, వాటిని అన్నివిధాలుగా నడిపిస్తోంది టెహ్రానే. కాబట్టి ఆ గ్రూపులు అంతం కావాలంటే ఇరాన్ ఉండకూడదు.. కనీసం టెహ్రాన్ పూర్తిగా బలహీనమైనా అవ్వాలి. ఈ రెండింట్లో ఏదో ఒకటి జరగాలని టెల్ అవీవ్ చాలా కాలంగా కోరుకుంటోంది. ట్రంప్ ఎంట్రీ తర్వాత నెతన్యాహులో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పుడు నేరుగానే అగ్రరాజ్యం, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులు యుద్ధం వరకూ వెళితే ఇరాన్‌పై పగ తీర్చుకునే ఛాన్స్ ట్రంప్ నెతన్యాహుకే ఇస్తారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుం టే ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఒక్కటి మాత్రంనిజం.. అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుత ఉద్రిక్తతలను నెతన్యాహు కనుక తనకి అనుకూలంగా మార్చుకుంటే పశ్చిమాసియాలో మారణహోమం మొదలైనట్టే.