YS SHARMILA VS BHARATHI: కడపలో వదినా-మరదలు సవాల్.. వైసీపీ తరపున భారతి ప్రచారం

అవినాష్ రెడ్డి, జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు అక్కాచెల్లెళ్ళు. ఇదే సమయంలో సీఎం జగన్ భార్య భారతి కూడా ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెడుతున్నారు. దాంతో కడప పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారబోతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 11, 2024 | 01:56 PMLast Updated on: Apr 11, 2024 | 1:56 PM

Ys Bharathi Will Campaign For Ysrcp In Kadapa Pulivendula For Ys Jagan

YS SHARMILA VS BHARATHI: ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి కడప నియోజకవర్గంలో పోరు ఆసక్తికరంగా మారబోతోంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డికి కడప వైసీపీ ఎంపీ టిక్కెట్ ఇవ్వడంతో.. ఆయనపై కాంగ్రెస్ తరపున షర్మిల పోటీ చేస్తున్నారు. వివేకా కూతురు సునీతతో కలసి ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. అవినాష్ రెడ్డి, జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు అక్కాచెల్లెళ్ళు. ఇదే సమయంలో సీఎం జగన్ భార్య భారతి కూడా ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెడుతున్నారు. దాంతో కడప పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారబోతున్నాయి.

Sajjala Ramakrishna Reddy: టార్గెట్‌ సజ్జల.. ఈసీ వేటు తప్పదా?

ఏపీలో ఎన్నికల ప్రచారంలో జగన్, చంద్రబాబు, పవన్‌తో పాటు షర్మిల కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నెల 18 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతోంది. సీఎం జగన్ ఈ నెల 22న పులివెందులలో నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బస్సు యాత్ర పూర్తయ్యాక పులివెందులో నామినేషన్ వేస్తారు జగన్. అయితే ఈసారి కడప లోక్‌సభ నియోజకవర్గంతో పాటు.. జగన్ పోటీ చేసే పులివెందుల అసెంబ్లీ సీటులో భారతి ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. జగన్ నామినేషన్ తరువాత భారతి పులివెందులలో ప్రచారం ప్రారంభిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో.. టీడీపీ అభ్యర్దిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్దిగా జగన్ పై వివేకానంద భార్య సౌభ్యాగ్యమ్మను నిలబెట్టే అవకాశమున్నట్టు తెలుస్తోంది. గత 2019 ఎన్నికలప్పుడు కూడా భారతి వైసీపీకి మద్దతుగా కడప జిల్లాలో ప్రచారం చేశారు. అయితే ఈసారి కడప ఎంపీ సీటుకు షర్మిల బరిలో ఉన్నారు.

వివేకానంద రెడ్డి హత్యకేసులో జగన్‌పై విమర్శలు చేస్తోంది షర్మిల. అలాగే సీఎంగా కూడా జగన్ విఫలమయ్యారని అంటున్నారు. ఈ సమయంలో భారతి కడప జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. భారతి వైసీపీ అభ్యర్దులకు మద్దతుగా ప్రచారం చేస్తారనీ.. షర్మిల గురించి ఆమె మాట్లాడే అవకాశం ఉండదని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. భారతి ప్రచారంలోకి దిగితే షర్మిల ఎలా స్పందిస్తారనేది చూడాలి. కడపలో వదినా మరదళ్ళ సవాల్ ఇంట్రెస్టింగ్ ఉంది.