YS JAGAN: జగన్ చేతిలో ఉంది రూ.7 వేలే.. ఆస్తి మాత్రం రూ.700 కోట్లు
జగన్ అక్రమంగా లక్ష కోట్ల ఆస్తులు సంపాదించారు అనేది ఆయనపై ఎప్పటినుంచో ఉన్న ఆరోపణ. ఇదే అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు కూడా వెళ్లారు. చెల్లి షర్మిలతో కూడా ఆస్తి విషయంలోనే జగన్‌కు విభేదాలు వచ్చాయనే ఆరోపణ కూడా ఉంది.
Affidavit_ YS JAGAN MOHAN REDDYYS JAGAN: ఎపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న నేతలంతా వరుసగా నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ పులివెందుల నుంచి నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రాసెస్‌లో భాగంగా ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. జగన్ అక్రమంగా లక్ష కోట్ల ఆస్తులు సంపాదించారు అనేది ఆయనపై ఎప్పటినుంచో ఉన్న ఆరోపణ.
MEGASTAR CHIRANJEEVI: కూటమికి మెగాస్టార్ మద్దతు.. చిరు పరువు తీసుకుంటున్నారా..?
ఇదే అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు కూడా వెళ్లారు. చెల్లి షర్మిలతో కూడా ఆస్తి విషయంలోనే జగన్‌కు విభేదాలు వచ్చాయనే ఆరోపణ కూడా ఉంది. ఇలాంటి క్రమంలో జగన్ ఆస్తుల వివరాలు ఇప్పడు హాట్ టాపిక్‌గా మారాయి. జగన్ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తి విలువ 700 కోట్లు. ఇందులో జగన్ పేరు మీద ఉన్న చరాస్తుల విలువ 483 కోట్ల 8 లక్షలు. వైఎస్ భారతి పేరు మీద ఉన్న చరాస్తుల విలువ 119 కోట్ల 38 లక్షలు. ఇక జగన్ స్థిరాస్తులు విలువ 35 కోట్ల 90 లక్షలు. భారతి పేరు మీద ఉన్న స్థిరాస్తుల విలువ 31 కోట్ల 11 లక్షలు. ఇక్కడ అన్నిటి కంటే హైలెట్ పాయింట్ ఏంటి అంటే.. జగన్ దగ్గర ఇప్పుడు ఉన్న నగదు కేవలం 7 వేలు మాత్రమే.
ఇక ఆయన భార్య దగ్గర ఉన్న నగదు కేవలం 10 వేల 22 రూపాయలు. జగన్ పెద్దకూతురు దగ్గర 9 వేలు.. చిన్న కూతురు దగ్గర 6 వేల 8 వందలు మాత్రమే ఉన్నాయట. ఒక రాష్ట్రానికి సీఎం ఐన జగన్ దగ్గర కేవలం 7 వేలు మాత్రమే ఉండం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.