YS JAGAN: వాట్ ఏ ప్లాన్.. ఒక్క మాట అనకుండా చెల్లికి చెక్ పెట్టిన జగన్..
టికెట్ రాదు అన్న సమాచారంతో వైసీపీకి రాజీనామా చేసి షర్మిలక్కతోనే అడుగులు.. షర్మిలక్కతోనే ప్రయాణం అని.. కాంగ్రెస్‌లో చేరిపోయారు. కట్ చేస్తే.. నెలరోజులు తిరగకముందే సీన్ మారింది. ఆళ్ల.. మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.
YS JAGAN: ఏపీ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయ్. ఎత్తులకు పైఎత్తులతో పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయ్. వైసీపీ గ్రాఫ్‌ను పెంచుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సిద్ధం పేరుతో నియోజకవర్గాల వారీగా సభలు పెడుతూ.. కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. మూడు పార్టీలు కలిసి వచ్చినా సరే.. దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గ ఇంచార్జిలను మారుస్తున్నారు జగన్.
REVANTH REDDY: ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం.. మరి చంద్రబాబును తిడతారా?
ఇక ఆయన నిర్ణయంతో కొందరు అలకపాన్పు ఎక్కుతుంటే.. మరికొందరు మాత్రం ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. జంప్ జిలానీ అంటున్నారు. ఆళ్ల విషయంలో అదే జరిగింది. టికెట్ రాదు అన్న సమాచారంతో వైసీపీకి రాజీనామా చేసి షర్మిలక్కతోనే అడుగులు.. షర్మిలక్కతోనే ప్రయాణం అని.. కాంగ్రెస్‌లో చేరిపోయారు. కట్ చేస్తే.. నెలరోజులు తిరగకముందే సీన్ మారింది. ఆళ్ల.. మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. జగన్ సమక్షంలో ఫ్రెష్‌గా వైసీపీ కండువా కప్పుకున్నారు. నిజానికి ఆళ్ల రాజీనామా తర్వాత.. వైసీపీలో చిన్నపాటి అలజడి కనిపించింది. ఆ పార్టీకి రాజీనామా చేసి.. షర్మిల పక్కన ఆళ్ల చేరడం.. జగన్‌ను ఇరుకున పడేసినట్లు అయింది. పార్టీ సంగతి ఎలా ఉన్నా పర్సనల్‌గా జగన్‌ను ఇది చాలా హర్ట్ చేసిందనే చర్చ ఉంది. ఇలాంటి పరిణామాల మధ్య.. ఆళ్ల మళ్లీ వైసీపీ కండువా కప్పుకోవడం ఆసక్తి రేపుతోంది.
ఓ వైపు షర్మిల.. అన్నను తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతుంటే.. జగన్ మాత్రం ఒక్క మాట కూడా అనకుండా చెల్లికి చెక్ పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ఆళ్లను.. కాంగ్రెస్‌కు దూరం చేయడం ద్వారా ఒక్క మాట కూడా అనకుండానే చెల్లి షర్మిల జోరుకు జగన్ బ్రేకులు వేశారనే చర్చ వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆళ్లను లాగేయడం అంటే.. ఒక లీడర్‌ను లాగడం మాత్రమే కాదు. కాంగ్రెస్ కాన్ఫిడెన్స్‌ను, షర్మిల ధైర్యాన్ని లాగేయడం అని ఎవరికి వారు పోస్టులు పెడుతున్నారు. ఇక వైసీపీకి తిరిగొచ్చిన ఆళ్లకు టికెట్ ఇస్తారా లేదా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్లకు స్థానికంగా కేడర్ పెరిగింది. దీంతో వైసీపీ కార్యకర్తలు కూడా ఆయనకే సపోర్ట్‌గా నిలిచే చాన్స్ ఉంది. మంగళగిరి నుంచి లోకేశ్ పోటీ చేయబోతున్నారు. అతన్ని ఎలాగైనా ఓడించాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్న వైసీపీకి.. ఆళ్ల రాక మరింత ప్లస్ కావడం ఖాయం.