మిమ్మల్ని మర్చిపోను.. జగన్ హాట్ కామెంట్స్
ఇడుపులపాయలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం పార్టీ నేతలతో మాజీ సిఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజలకిచ్చిన ప్రతీ హామీని అమలుచేసిన ప్రభుత్వం మనదన్నారు జగన్.
ఇడుపులపాయలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం పార్టీ నేతలతో మాజీ సిఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజలకిచ్చిన ప్రతీ హామీని అమలుచేసిన ప్రభుత్వం మనదన్నారు జగన్. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని చేతులెత్తేసిందని ఎద్దేవా చేసారు. ప్రజా సమస్యలపై ప్రజల తరుపున మనం పోరుబాట పట్టామని తెలిపారు. మీ అందరి సహాయ, సహకారాలు కావాలిని కడప కార్పొరేటర్లు, ముఖ్యనేతలను కోరారు జగన్.
ప్రజలకిచ్చిన మాట మీద నిలబడి, ప్రజల కష్టాలను నా కష్టాలుగా భావించి, ప్రజలకు మంచి చేశాం, ఈ రోజు కూడా ప్రతి ఇంటికీ మనం కాలర్ ఎగరవేసుకుని వెళ్ళగలుగుతాం, ప్రతి ఇంట్లో మనం చెప్పింది చేశామనే మాట ప్రజల నుంచి వినిపిస్తుంది, ప్రజలు సంతోషంగా మీరు చేశారంటున్నారని… అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల దగ్గరకు వెళ్ళి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ చేశామని వెళ్ళగలుగుతారా అని నిలదీశారు. వాళ్ళు ప్రజల దగ్గరకు వెళ్ళాలంటే భయపడే పరిస్ధితి అన్నారు.
ఏ ఇంటికి వెళ్లినా చిన్నపిల్లలతో సహా నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని వారి తల్లులైతే నీకు రూ.18 వేలు, ఆ అమ్మలకు తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన పిల్లవాడు ఇంట్లో కనిపిస్తే రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని ఇంట్లో ఎవరినీ వదిలిపెట్టకుండా ఆశపెట్టారని మండిపడ్డారు. వారంతా మా డబ్బులు ఏమయ్యాయని నిలదీస్తారు, ఏ టీడీపీ కార్యకర్త ఎవరి ఇంటికి వెళ్ళే పరిస్ధితి లేదన్నారు. జమిలి ఎన్నికలు 2027లో అంటున్నారన్నారు.
నెలలు గడిచేకొద్ది చంద్రబాబులో భయం పెరిగిపోతుంది, మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నాం, మన ప్రభుత్వం మళ్ళీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్నవారికి మంచిరోజులు వస్తాయి, ఇబ్బందులు కొంతకాలం ఉంటాయి, మనల్ని ప్రలోభాలకు గురిచేసినా కొంత ఓపిక పట్టండి, మీకు నా తమ్ముడు అవినాష్ అందుబాటులో ఉంటారు, మీకు ఏ అవసరం వచ్చినా తనను కలవండి, తప్పకుండా సాయం చేస్తారు, నేను కడప బిడ్డను కాబట్టే మీరంటే నాకు ప్రత్యేకమైన అనుబంధం, మీరందరి ప్రేమ ఎప్పటికీ మరిచిపోనని స్పష్టం చేసారు జగన్.