ఆ రోజులెక్కడ, నేను చేసిన పుణ్యం ఏది: జగన్ షాకింగ్ కామెంట్స్

రెడ్ బుక్ పరిపాలనతో రాజ్యాంగ తూట్లు పోవడమే కనిపిస్తుంది అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. నేడు తాడేపల్లి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్... పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యం రాష్ట్రములో కనిపిస్తుందని మండిపడ్డారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 28, 2024 | 06:50 PMLast Updated on: Nov 28, 2024 | 6:50 PM

Ys Jagan Fire On Kootami Govt

రెడ్ బుక్ పరిపాలనతో రాజ్యాంగ తూట్లు పోవడమే కనిపిస్తుంది అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. నేడు తాడేపల్లి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్… పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యం రాష్ట్రములో కనిపిస్తుందని మండిపడ్డారు. చేసిన అభివృద్ధి వెనక్కి పోతుందన్నారు. 3648 కిలో మీటర్ల పాదయాత్ర లో చూసిన కష్టాలు, తెలుస్కుకున్న బాధలు లకు సొల్యూషణ్ ఇచ్చానని తెలిపిన ఆయన సాధ్యం అవుతుందా అనే దగ్గర నుండి సాధ్యం చేసి చూపించామన్నారు. లంచాలు లేకుండా పథకాలు అమలు చేశామని ఆయన పేర్కొన్నారు.

గ్రామ స్వరాజ్యం అమలు చేశామన్న జగన్… 540 రకాల సేవలు గ్రామంలో ఇంటివద్ద డోర్ డెలివరీ చేసామని గుర్తు చేసారు. వివక్ష, లంచాలు లేని పాలన గత 5ఏళ్లలో చేశామన్న జగన్… క్యాలెండర్ ఇచ్చి మరీ పథకాలు అమలు చేశామని పేర్కొన్నారు. మళ్ళీ జన్మభూమి కమిటీలు, గవర్నమెంట్ బడులు కార్పోరేట్ బడులకు పోటీగా తీసుకుని వచ్చామన్నారు. ఇంగ్లీష్ మీడియం, విద్యార్థులకు ట్యాబ్, అమ్మవడి, ఫీజ్ రియంబర్స్, టోఫెల్ అన్ని వైస్సార్సీపీ ప్రభుత్వం లోనే తీసుకుని వచ్చామన్నారు. గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్..52వేల వైద్య రంగంలో పోస్టులు నింపిన ఘనత వైస్సార్సీపీ దే అని చెప్పుకొచ్చారు.

దళారి వ్యవస్థ కి చెక్ పెట్టి RBK పెట్టాం.. ఈ క్రఫ్ ప్రవేశ పెట్టింది వైస్సార్సీపి నే అని ఆయన స్పష్టం చేసారు. మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతులు ధాన్యం అమ్ముకొంటున్నారన్నారు. ఫీజ్ రియంబర్స్ అందక విద్యార్థులు పనుల్లోకి వెళ్తున్నారని పేర్కొన్నారు. 2వేల కోట్ల పైన ఫీజ్ రియంబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. 108, 104 పడకేసాయని ఆరోపించారు. 10వేలు ఇస్తామని వలేంటర్లు ఉద్యోగాలు తీసేసారని మండిపడ్డారు. గ్రామ వార్డు సచివాలయం పరిస్థితి ఏంటో ఎవరికి తెలీదన్నారు. సంపద సృష్టి.. వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని స్పష్టం చేసారు. 3 కొత్త సిపోర్ట్ లు నిర్ణయం వేగంగా జరిగింది.. 12వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అన్నారు జగన్.

పోర్ట్ లు లక్షల కోట్లకు వాల్యూ అని 17 మెడికల్ కాలేజ్ లో 5 వైస్సార్సీపీ ప్రభుత్వం లో ఏర్పాటు అయినట్టు తెలిపారు. రైతులకు ఉచిత కరెంటు కి 9వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. చంద్రబాబు హయాంలో డిస్కామ్స్ 29వేల కోట్లు అప్పులు , దిగిపోయే నప్పుడు బకాయిలు ఉంటే 84వేల కోట్లకు చేరాయన్నారు. టీడీపీ 13255 కోట్లు ఫైనల్ సపోర్ట్ చేస్తే..47800 కోట్లు వైస్సార్సీపీ సహాయం చేసిందన్నారు. ఉదయం పూట 9 గంటల కరెంట్ ఇచ్చామని పేర్కొన్నారు. 2020 నవంబర్ లో 6వేల సోలార్ పవర్ కి టెండర్లు పిలిచామన్నారు.