AP Volunteers: ఏపీ వాలంటీర్లకు లాస్ట్ వర్కింగ్ డే మే 31 ! జగన్ అందుకే మొదటి సంతకం అంటున్నారా..?
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల లాస్ట్ వర్కింగ్ డే మే 31. అప్పటితో వాళ్ళతో ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ అయిపోతుంది. కాంట్రాక్ట్ పద్దతిన పనిచేస్తున్న వాలంటీర్లు మళ్ళీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటేనే జూన్ 1 నుంచి వాళ్ళు కొనసాగడానికి అవకాశం ఉంటుంది.
AP Volunteers: ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ల ఇష్యూ చాలా కీలకంగా మారింది. అవ్వా తాతలకు వాలంటీర్లు ఫించన్లు ఇవ్వకుండా ఈసీ ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబే ఫించన్లు ఆపించాడని సీఎం జగన్‌తో పాటు వైసీపీ లీడర్లు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈమధ్య సభల్లో తాను మళ్ళీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థ మీద పెడతానని సీఎం జగన్ అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వాలంటీర్లు పనిచేస్తున్నారు కదా.. మళ్ళీ సంతకం పెట్టడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
PK ON JAGAN, BJP : జగన్ గెలవడం కష్టమే.. తెలంగాణలో బీజేపీ హవా..
కానీ అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల లాస్ట్ వర్కింగ్ డే మే 31. అప్పటితో వాళ్ళతో ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ అయిపోతుంది. కాంట్రాక్ట్ పద్దతిన పనిచేస్తున్న వాలంటీర్లు మళ్ళీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటేనే జూన్ 1 నుంచి వాళ్ళు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అంటే మే 31 తర్వాత వాలంటీర్ల ఉద్యోగాలు పోయినట్టే. వాళ్ళకి అప్పటి నుంచి జీతాలు కూడా రావు. వైసీపీ ప్రభుత్వం కావాలనే వాలంటీర్లను ఇలా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మే 31 తర్వాత వాలంటీర్లకు ఉద్యోగాలు రావాలంటే.. మళ్ళీ జగన్ అధికారంలోకి రావాలని పరోక్షంగా వాళ్ళకి సంకేతాలు పంపుతున్నారు. అయితే వైసీపీ లేదా టీడీపీ.. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గతంలో పనిచేసిన వాలంటీర్లకే మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాయన్న గ్యారంటీ లేదు. పాత వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోయింది కాబట్టి.. కొత్తవాళ్ళకి కూడా అవకాశం ఇచ్చే ఛాన్సూ ఉంది. చంద్రబాబుకి వ్యతిరేకంగా రిజైన్ చేయాలని మంత్రులు, వైసీపీ నేతలు వాలంటీర్లకు సూచిస్తున్నారు. ఇప్పుడు రిజైన్ చేసి.. గ్రామాల్లో తమకున్న పలుకుబడితో వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా పనిచేయాలన్న ఒత్తిడి కూడా వాలంటీర్లపై పెరుగుతోంది.
కానీ ఏపీలో పనిచేస్తున్న 5 లక్షల మంది వాలంటీర్లలో ఐదు వేల మంది కూడా ఇప్పటి దాకా రిజైన్ చేయలేదు. వైసీపీ లీడర్ల ఒత్తిళ్ళను వాళ్ళు పట్టించుకోవట్లేదు. అటు చంద్రబాబు కూడా గతంలో వాలంటీర్ల వ్యవస్థు తిట్టిపోసినా.. గ్రామాల్లో వాళ్ళెంత కీలకమని అర్థం చేసుకున్నారు. అందులో మొన్నటి ఫించన్ల షాక్‌తో టీడీపీకి కొంత డ్యామేజ్ కూడా జరిగింది. అందుకే తమ కూటమి అధికారంలోకి వస్తే.. యాభై వేల ఆదాయం వచ్చేలా చేస్తానని బాబు హామీ ఇస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసేది లేదని చెబుతున్నారు. దాంతో కొందరు వాలంటీర్లు బాబుకి అనుకూలంగా మారుతున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో కొందరు టీడీపీకి అనుకూలంగా రిజైన్లు చేసేది లేదని తీర్మానం కూడా చేసినట్టు సమాచారం.