YS JAGAN: అవ్వ.. తాత.. ఇద్దరికీ పెన్షన్‌.. సంచలనాలకు కేరాఫ్‌గా జగన్‌ మేనిఫెస్టో..

వైసీపీ మేనిఫెస్టో సంచలనాలకు కేరాఫ్‌గా ఉండబోతుందని ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించే విధంగా.. ఓ కీలక నిర్ణయాన్ని జగన్‌ త్వరలో ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2024 | 02:28 PMLast Updated on: Feb 19, 2024 | 2:28 PM

Ys Jagan Preparing Manifesto To Give Pension To Wife And Husband

YS JAGAN: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. సిద్ధం అంటూ ఇప్పటికే విపక్షాలకు సవాల్ విసిరిన సీఎం జగన్.. మరో మాస్టర్ స్ట్రోక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. మహిళలు, రైతులను ఆకట్టుకునేలా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చినా సరే.. ఆ కూటమిని దీటుగా ఎదుర్కొనేందుకు జగన్ ఆఖరి అస్త్రాన్ని మేనిఫెస్టో రూపంలో బయటకు తీయబోతున్నట్లు తెలుస్తోంది.

Arvind Dharmapuri: నియంత అర్వింద్ వెళ్లిపో.. నువ్‌ మాకొద్దు.. బీజేపీ నేతల తిరుగుబాటు..

వైసీపీ మేనిఫెస్టో సంచలనాలకు కేరాఫ్‌గా ఉండబోతుందని ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించే విధంగా.. ఓ కీలక నిర్ణయాన్ని జగన్‌ త్వరలో ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. భార్యాభర్తలిద్దరికీ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వనున్నట్లు జగన్ తన మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయ్. దీనికి సంబంధించి జగన్‌ నుంచి త్వరలో నిర్ణయం వెలువడే చాన్స్ ఉంది. ఏపీలో ప్రస్తుతం కుటుంబంలో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ అందిస్తున్నారు. భార్యాభర్తలిద్దరికీ పెన్షన్ ఇవ్వడంతో పాటు.. ఆ పెన్షన్ మొత్తాన్ని 3 వేల నుంచి 4వేలకు పెంచాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోబోతున్నారు. మేనిఫెస్టోలో ఈ హామీని పెట్టే అవకాశాలు ఉన్నాయ్. ఇక పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్‌ను.. ఏడాదికి 250 చొప్పున… నాలుగేళ్లలో పూర్తిగా ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారు.

ఇక భార్యభర్తలిద్దరికీ వృద్ధాప్య పెన్షన్ ఇస్తే.. ఏపీలో పెన్షనర్లు మరో 10లక్షల మంది పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో 70లక్షల మంది పెన్షనర్లు ఉండగా.. ఆ సంఖ్య 80లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో పాటు.. జగన్ మేనిఫెస్టో చాలా సంచలనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ముఖ్యంగా మహిళలు, రైతులను ఆకట్టుకునేలా మరిన్ని హామీలు జగన్ గుప్పించే అవకాశాలు ఉన్నాయ్. రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంలాంటివి కూడా మేనిఫెస్టోలో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్.