YS JAGAN: సీఎంగా విశాఖలోనే ప్రమాణస్వీకారం.. జగన్‌కు ఇంత కాన్ఫిడెన్సా.. అంత ధైర్యమేంటి..?

విశాఖ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. త్వరలోనే హైదరాబాద్‌ను మించి దూసుకెళ్తుందని చెప్పారు. ఇక్కడితో ఆగితే పర్లేదు.. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తామని.. మళ్లీ గెలిచి వచ్చి విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని జగన్‌ కాన్ఫిడెంట్‌గా చెప్పారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2024 | 04:25 PMLast Updated on: Mar 05, 2024 | 4:25 PM

Ys Jagan Says He Will Sworn As Cm In Vizag What Is His Confidence

YS JAGAN: వైనాట్‌ 175 నినాదంతో దూసుకుపోతున్న జగన్‌లో.. టీడీపీ, జనసేన కూటమిగా వస్తున్నా సరే.. కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గడం లేదు. ఓ వైపు నాయకుల వరుసగా పార్టీకి బైబై చెప్తున్నా.. మళ్లీ తానే సీఎం అని ధీమా చెప్తున్నారు. సాగరతీరం విశాఖలో జగన్ కాన్ఫిడెన్స్ లెవల్‌ ఏంటో మరోసారి బయటపడింది. వైజాగ్‌లో జరిగిన విజన్ విశాఖ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్.. నగరంలోని వనరులను పారిశ్రామికవేత్తలకు వివరించారు.

PM MODI: మోదీకి దేశమే ఫస్ట్.. కుటుంబ పాలనకు మేం వ్యతిరేకం: ప్రధాని మోదీ

విశాఖ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. త్వరలోనే హైదరాబాద్‌ను మించి అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పారు. ఇక్కడితో ఆగితే పర్లేదు.. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తామని.. మళ్లీ గెలిచి వచ్చి విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని జగన్‌ కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. టీడీపీ, జనసేన కూటమి ఓ వైపు.. జనాల్లో కనిపిస్తున్న వ్యతిరేకత మరోవైపు.. సొంత పార్టీలో కుంపట్లు ఇంకోవైపు.. ఇలాంటి పరిణామాల మధ్య గెలుపు మీద జగన్‌కు ఇంత ధీమా ఏంటి అనే చర్చ జరుగుతోంది. జగన్ కాన్ఫిడెన్స్ ఏంటో.. విపక్షాలకు కూడా అప్పుడప్పుడు అంతుచిక్కిన పరిస్థితి. ఐతే వైసీపీ నేతల లెక్కలు ఇంకోలా ఉన్నాయ్. 2019 ఎన్నికల్లో 50శాతం వరకు ఓట్ షేర్ సాధించామని.. ఈ ఐదేళ్లలో 5 నుంచి 10 శాతం వరకు ఓటింగ్ శాతం పెరిగిందని.. స్థానిక ఎన్నికల్లో ఫలితాలే దానికి నిదర్శనం అని.. ఏవేవో లెక్కలేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఓవరాల్‌గా తమ పార్టీకి 60శాతం ఓట్ షేర్ ఉందన్నది వైసీపీ నేతల లెక్క.

ఇలాంటి టైమ్‌లో ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకుని వచ్చినా.. గెలిచేది జగనే అని అధికార పార్టీ నేతలు ఊహించేసుకుంటున్నారు. టీడీపీ గత ఎన్నికల్లో 40శాతం, జనసేన 6శాతం ఓటు బ్యాంక్ సాధించిందని.. ఐతే ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలవడంతో ఓటు బ్యాంక్ పెరిగినా.. 50 శాతం వరకు పెరుగుతుందని.. ఐనా సరే తమ పార్టీకి పోటీ ఇవ్వలేదని.. అధికారం తమదే అని వైసీపీ కార్యకర్తలు, నేతలు చెప్తున్న మాట. ఏమైనా మళ్లీ విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని జగన్‌.. మళ్లీ అధికారం తమదే అని వైసీపీ నేతలు.. వీళ్ల నమ్మకం చూస్తుంటే మాములు ముచ్చటగా లేదు అంటూ.. కామెంట్లు వినిపిస్తున్నాయ్.