మా వర్మపై కేసు పెడతార్రా…? నా చెల్లిపై తప్పుడు రాతలు: జగన్ ఫైర్
ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. దర్శకుడు వర్మ పై కేసులపై జగన్ రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలు, సినీ దర్శకులు పైనా కేసులు పెడుతున్నారన్న జగన్... వివేకం అనే సినిమా తీస్తే తప్పులేదు అంటూ మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మ సినిమా కి సెన్సార్ బోర్డు అప్రూవల్ వుందన్నారు.
ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. దర్శకుడు వర్మ పై కేసులపై జగన్ రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలు, సినీ దర్శకులు పైనా కేసులు పెడుతున్నారన్న జగన్… వివేకం అనే సినిమా తీస్తే తప్పులేదు అంటూ మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మ సినిమా కి సెన్సార్ బోర్డు అప్రూవల్ వుందన్నారు. సెన్సార్ బోర్డు అప్రూవల్ వున్న సినిమా తీస్తే అరెస్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అంబటి,కొడాలి నాని, రోజా పై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నా పైనా క్యారెక్టర్ అశాసినేషన్ చేశారన్నారు జగన్.
తల్లి,చెల్లి అంటూ మా కుటుంబం గురించి మాట్లాడుతున్నారని.. మీకు కుటుంబం ఉందన్నారు జగన్. కుటుంబంలో విభేదాలు సహజమన్న ఆయన… నా సోదరి షర్మిల మిద బాలకృష్ణ ఇంటి నుంచి చంద్రబాబు తప్పుడు వార్తలు రాసి ప్రచారం చేయలేదా? అని నిలదీశారు. తప్పుడు ప్రచారం చేయడంలో తెలుగుదేశం, చంద్రబాబు నైజం అని జగన్ మండిపడ్డారు. వర్ర రవీంద్ర పేరు తో ఐడిటిపి వాళ్ళు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మా అమ్మని,చెల్లిని తిట్టించారు చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేసారు జగన్.
చంద్రబాబు లాంటి వాళ్ళు అరుదుగా పుడతారని ఎద్దేవా చేసారు జగన్. నీ తల్లి దండ్రులు ఎవరో రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? అని నిలదీశారు. వారితో ఎప్పుడు అయినా కలిసి వున్నవా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నీవు రాజకీయంగా ఎదిగిన తరువాత నీ ఇంటికి పిలిచి రెండు పూటలా భోజనం పెట్టావా? అని నిలదీశారు. వాళ్ళు కాలం చేస్తే తల కొరివి అయినా పెట్టావా? అంటూ ప్రశ్నించారు జగన్. సోషల్ మీడియాలో పోస్టులు పై తప్పుడు కేసులు పెడుతున్నారని… తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు అంటూ మండిపడ్డారు జగన్.