బిగ్ బ్రేకింగ్: కాలినడకన తిరుపతికి జగన్
ఆంధ్రప్రదేశ్ లో లడ్డు వ్యవహారం ఇప్పుడు వైసీపీని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మీరు పాపం చేసారని కూటమి నేతలు అంటుంటే మేం చేయలేదు అని వైసీపీ అంటోంది.

ఆంధ్రప్రదేశ్ లో లడ్డు వ్యవహారం ఇప్పుడు వైసీపీని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మీరు పాపం చేసారని కూటమి నేతలు అంటుంటే మేం చేయలేదు అని వైసీపీ అంటోంది. ఇక ప్రజల్లోకి ఇది బలంగా వెళ్తున్న నేపధ్యంలో వైసీపీ దీన్ని ఎలా కడుక్కోవాలో ఆర్ధం కాక నానా కష్టాలు పడుతోంది. తాజాగా వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తాము పాపం చేయలేదని చెప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
దేశ వ్యాప్తంగా కూడా జగన్ పై విమర్శలు వస్తున్న నేపధ్యంలో కీలక అడుగు వేస్తున్నారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలలో పాపా ప్రక్షాళన చేసేందుకు ప్రతేక పూజలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు. అదే విధంగా ఈ నెల 28 న కాలి నడకన తిరుపతి వెళ్లాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.