శ్యామలకు షాక్ ఇచ్చిన జగన్.. మీడియాతో మాట్లాడకని వార్నింగ్
వైసీపీలో గత కొన్ని రోజుల నుంచి యాంకర్ శ్యామల హడావుడి ఎక్కువగా కనబడుతోంది. పార్టీ కోసం గత 15 ఏళ్ళ నుంచి కష్టపడిన వారి కంటే ఆమె సందడి ఎక్కువగా చేసింది. మీడియా ముందు డైలాగులు కూడా ఎక్కువగానే వినిపించింది. పదేపదే మీడియా సమావేశాల్లో కనపడుతూ అధికార పార్టీపై విమర్శలు చేస్తుంది శ్యామల.
వైసీపీలో గత కొన్ని రోజుల నుంచి యాంకర్ శ్యామల హడావుడి ఎక్కువగా కనబడుతోంది. పార్టీ కోసం గత 15 ఏళ్ళ నుంచి కష్టపడిన వారి కంటే ఆమె సందడి ఎక్కువగా చేసింది. మీడియా ముందు డైలాగులు కూడా ఎక్కువగానే వినిపించింది. పదేపదే మీడియా సమావేశాల్లో కనపడుతూ అధికార పార్టీపై విమర్శలు చేస్తుంది శ్యామల. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కాస్త వెనక్కు తగ్గిన శ్యామల… ఆ తర్వాత అధికార ప్రతినిధి పదవి ఇవ్వడంతో మీడియాలో హడావుడి పెంచింది.
ఆమె చేస్తున్న కామెంట్స్ కు కాస్త వైసిపి సోషల్ మీడియా కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడంతో శ్యామల మరింత రెచ్చిపోయి కామెంట్స్ చేసింది. అయితే ఇప్పుడు శ్యామల మీడియా సమావేశాలు వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయట. వైసీపీలో కొంతమంది మహిళా సీనియర్ నాయకులు శ్యామల విషయంలో సీరియస్ గా ఉన్నారు. పార్టీ కోసం ముందు నుంచి తాము ఖర్చు పెట్టి అలాగే తాము కష్టపడితే, కేసులతో ఇబ్బందులు పడితే.. ఆమెకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఇప్పటికే మాజీ మంత్రులు రోజా అలాగే విడదల రజిని పార్టీ అధిష్టానం వద్ద అసహనం వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరిగింది.
అలాగే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా రాయలసీమలో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని రోజా తప్పు పట్టారు. అయితే ఇప్పుడు యాంకర్ శ్యామల విషయంలో పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మీడియా సమావేశాలు నిర్వహించోద్దని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె నిర్వహించే మీడియా సమావేశాలు తిరిగి వైసిపికి తలనొప్పిగా మారడం… వైసిపి పై సెటైర్లు రావడంతో పార్టీ అధినేత జగన్ దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వైసీపీలో ఇతర నాయకులు ఎవరూ మాట్లాడకపోవడంతో శ్యామలకు అధికార ప్రతినిధి పదవిని అప్పగించారు జగన్. ఇక ఆ పదవిని ఆమె సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ విమర్శలు చేస్తుంది. అయితే ఈ విమర్శలు కేవలం ఆర్టిఫిషియల్ గా ఉండడం అవి జనాల్లోకి వెళ్లే విధంగా లేకపోవడంతో అనవసరంగా తలనొప్పులు వద్దని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఆమె మాటలను జనాలు కూడా వినకపోవడం, అవి కామెడీగా మారడంతో అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంది.
అందుకే ఇక మీడియా సమావేశాల్లో పాల్గొనవద్దని ఏదైనా పార్టీ సమావేశాల్లో పాల్గొనాలని.. అక్కడైనా సరే మితంగానే ప్రసంగించాలని ఆమెకు పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. దీనితో గత కొన్ని రోజులుగా యాంకర్ శ్యామల మీడియాలో హడావుడి తగ్గించినట్లు అర్థమవుతుంది. ఏదైనా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే కచ్చితంగా లెక్కలు, విషయం మాట్లాడుతూ… ఏర్పాటు చేయాలని విమర్శలు కూడా కాస్త బలంగా ఉండేలా చూడాలని ఆమెకు సూచించారట. ప్రస్తుతం మీడియాకు దూరంగా ఉండి పని చేయవలసిందిగా పార్టీ నేతలు ఆదేశించినట్లు సమాచారం. ఇక యాంకర్ శ్యామల విషయంలో పార్టీ నేతలు కూడా సీరియస్ గా ఉండటంతో అనవసరమైన తలనొప్పులు వద్దని ఆమెకు ప్రాధాన్యత తగ్గించాలని జగన్ భావించినట్లు తెలుస్తోంది.