YS JAGAN: వైసీపీకి 50మంది ఎమ్మెల్యేలు షాక్ ! ఇప్పుడు ఆళ్ల.. నెక్ట్స్ ఎవరు ?
వైనాట్ 175 అంటూ దూసుకుపోతున్న జగన్.. పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలను పక్కనపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణ ఫలితాలను చూసి.. అది పక్కాగా ఫిక్స్ అయ్యారు. 2024 ఎన్నికల్లో సుమారు 50మంది సిట్టింగ్స్‌కు ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
YS JAGAN: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి.. రెండింటికి రాజీనామా ఇచ్చారు ఆళ్ల. స్పీకర్‌కు లేఖ కూడా పంపారు. ఐతే అందులో కారణం ఏంటి అన్నది మాత్రం చెప్పలేదు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి వైసీపీ టికెట్ గంజి చిరంజీవికి ఇస్తారని ప్రచారం జరుగుతుండటం.. దానికితోడు చిరంజీవి కూడా మంగళగిరిలో దూకుడు పెంచడంతో.. ఆళ్ల వైసీపీని వీడారనే ప్రచారం జరుగుతోంది. క్లియర్‌గా చెప్పాలంటే.. టికెట్ రావడం కష్టమని తెలిసే ఫ్యాన్ పార్టీకి హ్యాండ్ ఇచ్చారన్న మాట.
Alla Ramakrishna Reddy: రాజీనామా వెనక! ఆళ్ల రాజీనామాకు ఆయనే కారణమా.. అసలేం జరిగింది ?
ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. వైనాట్ 175 అంటూ దూసుకుపోతున్న జగన్.. పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలను పక్కనపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణ ఫలితాలను చూసి.. అది పక్కాగా ఫిక్స్ అయ్యారు. 2024 ఎన్నికల్లో సుమారు 50మంది సిట్టింగ్స్‌కు ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎమ్మెల్యేల పనితీరు మీద తనకు అందిన నివేదికలను పరిశీలిస్తున్న జగన్.. తుది జాబితా సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ షెడ్యూల్‌కు మూడు నెలల ముందుగానే.. ఎన్నికల లెక్కలు ప్రారభించినట్లుగా తెలుస్తోంది. ఈ తుది దశ జాబితాలో సుమారు 50 మంది సిట్టింగ్‌లకు టికెట్ దక్కదని తెలుస్తోంది. ఇదే నిజం అయితే పరిస్థితి ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఆళ్ల రామకృష్ణారెడ్డిలానే.. ఆ టికెట్ దక్కని నేతలంతా వైసీపీకి రాజీనామా చేయడం ఖాయమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్.
ఒకవేళ అదే నిజం అయితే మాత్రం.. వైసీపీకి భారీ షాక్ తగలడం మాత్రం ఖాయం. ఇక అటు టీడీపీ నేతలు కూడా.. తమతో 50మంది వైసీపీ నేతలు టచ్‌లో ఉన్నారని పదేపదే చెప్తుండడం.. ఈ పరిణామాలను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. దీంతో ఎన్నికలకు ఆరు నెలలకు ముందుగానే ఏపీలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయ్.