YS JAGAN: టీడీపీ మైండ్‌బ్లాంక్ అయ్యేలా వైసీపీ మేనిఫెస్టో.. జగన్ ఇవ్వబోయే కొత్త హామీలు ఇవే !
రాప్తాడులో జరగనున్న సిద్ధం సభలో.. మేనిఫెస్టో అనౌన్స్ చేసేందుకు రెడీ అయ్యారు. టీడీపీ, జనసేన కూటమిగా వస్తుండడం.. పైగా సూపర్ సిక్స్ అంటూ ఇప్పటికే చంద్రబాబు ఆరు గ్యారంటీలు ప్రకటించడంతో.. జగన్ అలర్ట్ అయినట్లు కనిపిస్తున్నారు.

YS JAGAN: ఎట్టి పరిస్థితుల్లో అధికారం నిలబెట్టుకు తీరాలన్న కసితో కనిపిస్తున్న ఏపీ సీఎం జగన్.. టీడీపీ, జనసేన పార్టీలకు దీటుగా వ్యూహాలు రచిస్తున్నారు. వైనాట్ 175 అనే నినాదంతో.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకువచ్చేందుకు, వారిని ఎన్నికలకు రెడీ చేసేందుకు సిద్ధం పేరుతో భారీ సభలు నిర్వహిస్తున్నారు. రాయలసీమలోనూ సభ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాప్తాడులో జరగనున్న సిద్ధం సభలో.. మేనిఫెస్టో అనౌన్స్ చేసేందుకు రెడీ అయ్యారు.
Ongole YCP MP candidate : పూటకో పేరు… ఒంగోలు వైసీపీ ఎంపీ టిక్కెట్ ఎవరికో ?
టీడీపీ, జనసేన కూటమిగా వస్తుండడం.. పైగా సూపర్ సిక్స్ అంటూ ఇప్పటికే చంద్రబాబు ఆరు గ్యారంటీలు ప్రకటించడంతో.. జగన్ అలర్ట్ అయినట్లు కనిపిస్తున్నారు. టీడీపీ ప్రకటించిన సూపర్‌సిక్స్ మేనిఫెస్టోను మించి ఉండేలా.. హామీలను రూపొందించే పనిలో.. వైసీపీ స్పెషల్ టీమ్ పనిచేస్తోంది. 18న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని.. రాప్తాడు బహిరంగ సభలో… జగన్ ఈ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. మహిళలు, యువత, బీసీలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సూపర్ సిక్స్ పేరుతో తొలి విడత మేనిఫెస్టో రెడీ చేసిన టీడీపీ.. ఆ ఆరు గ్యారంటీలను జనాల్లోకి తీసుకెళ్తోంది. త్వరలో మలి విడత మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు టీడీపీ రెడీ అవుతున్న వేళ.. జగన్ మరింత అప్రమత్తం అయ్యారు.
మేనిఫెస్టో అనౌన్స్ చేయడానికి సిద్ధం అయ్యారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 98శాతం అమలు చేశామని పదేపదే చెప్తున్న జగన్.. కొత్త మేనిఫెస్టోలో ఏం చేర్చబోతున్నారా అనే ఆసక్తి కనిపిస్తోంది. కొత్తగా ఏఏ అంశాలకు జగన్ ప్రాధాన్యం ఇచ్చారనే దానిపై ఇంకా ఓ క్లారిటీ రాకపోయినా.. రైతులు, ఉద్యోగులు, మహిళలను టార్గెట్‌గా చేసుకొని మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 2లక్షల వరకు రైతు రుణమాఫీ, ఉద్యోగులకు బెనిఫిట్స్‌లాంటివి ప్రకటించే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సామాజికవర్గాలవారీగా ఆకట్టుకునేలా.. కొత్త మేనిఫెస్టో ఉండబోతున్నట్టు సమాచారం. ఒక పేజీ కంటే ఎక్కువ ఉండకుండా.. వైసీపీ మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.