చంద్రబాబు నీకంటే రేవంత్ బెస్ట్: షర్మిల ఫైర్
మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు వైఎస్ షర్మిల. కాలయాపన తప్పా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం లేదన్నారు.

మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు వైఎస్ షర్మిల. కాలయాపన తప్పా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం లేదన్నారు. అధికారం చేపట్టిన 6 నెలల్లో పండుగలు, పబ్బాలు పేరు చెప్పి దాటవేశారని బస్సులు కొంటున్నాం అని చెప్పుకొచ్చారన్నారు. ఇప్పుడు మంత్రి వర్గ ఉప సంఘం పేరుతో మరికొన్ని రోజులు సాగతీతకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఉచిత ప్రయాణం కల్పించడంలో ఇన్ని బాలారిష్టాలు ఎందుకు ? అని నిలదీశారు.
చిన్న పథకం అమలకు కొండత కసరత్తు దేనికోసం ? అని ప్రశ్నించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పథకం అమలు చేసి చూపించారు కదా ? అని నిలదీశారు. ఉన్న బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు కదా ? పథకం అమలును బట్టి అదనపు ఏర్పాట్లు చేసుకున్నారు కదా ? జీరో టిక్కెట్ల కింద నెలకు రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడానికి మీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మహిళల భద్రతకు మీకు మనసు రావడం లేదా ? అంటూ మండిపడ్డారు. ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి ? అని నిలదీశారు.