YS Sharmila: ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ అంటున్న షర్మిల.. అసలు మీతో కలుస్తామన్నది ఎవరు షర్మిలక్కా!!
వందల సభలు పెట్టినా.. వేల కిలోమీటర్లు నడిచినా.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైటీపీ)కి అనుకున్నంత పొలిటికల్ మైలేజ్ రావడం లేదు. దీంతో ఎలాగైనా అటెన్షన్ డ్రా చేయాలని వివాదాలు క్రియేట్ చేస్తున్నారేమో షర్మిల అనే స్థాయికి వచ్చాయ్ ఆమె వ్యూహాలు. ఇప్పుడు వైటీపీ గురించి ఓ చర్చ జరుగుతోంది.
YS Sharmila: నేను గానీ ఒక్క ఈల గానీ వేశానంటే.. ఓ సినిమాలో డైలాగ్ ఇది ! ఈల వేసేది లేదు.. జరిగేది లేదు. ఏదో జరగబోతుందని బిల్డప్ ఇవ్వడం తప్ప. ఎందుకూ పనికిరాదీ మాట. పాపం షర్మిల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వందల సభలు పెట్టినా.. వేల కిలోమీటర్లు నడిచినా.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైటీపీ)కి అనుకున్నంత పొలిటికల్ మైలేజ్ రావడం లేదు. దీంతో ఎలాగైనా అటెన్షన్ డ్రా చేయాలని వివాదాలు క్రియేట్ చేస్తున్నారేమో షర్మిల అనే స్థాయికి వచ్చాయ్ ఆమె వ్యూహాలు.
ఇప్పుడు వైటీపీ గురించి ఓ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌తో కలుస్తుందని.. కాంగ్రెస్‌లో కలిపేస్తుందని..! కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్‌తో వరుస భేటీలు నిర్వహిస్తూ.. రాజకీయవర్గాల్లో మరింత హీట్ పుట్టిస్తున్నారు షర్మిల. ఏందక్కా ఇదంతా.. ఏం జరుగుతుంది అంటే.. ఎవరితో పొత్తు లేదని.. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని అంటున్నారు షర్మిల. ఇదే ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యేలా చేస్తోంది. అదేదో వైటీపీ ఆఫీస్ ముందు పార్టీలు బారులు తీరినట్లు.. పొత్తుకు పోటీ పడినట్లు.. ఒంటరిగానే పోటీ అంటూ స్టేట్‌మెంట్‌లు ఎందుకు అక్కాయ్ అని సెటైర్లు వేస్తున్నారు చాలామంది..! షర్మిల పార్టీని చాలా పార్టీలు అసలు లెక్కలోకే తీసుకోవడం లేదు. షర్మిల ఎలాంటి విమర్శలు చేసినా.. ఏ ఆరోపణ గుప్పించినా.. కనీసం రియాక్ట్ అవడానికి కూడా ఇష్టపడడం లేదు చాలామంది నేతలు.
కేఏ పాల్‌ను, షర్మిలను సమానంగా చూస్తామని.. మరికొందరు నేతలు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. వైఎస్ అభిమానులంతా పార్టీలో చేరుతారు.. వైటీపీ బలంగా మారుతుందని షర్మిల రకరకాల అంచనాలు వేసుకున్నారు. కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్.. పోయేవాళ్లే తప్ప వచ్చేవాళ్లు లేకపాయె అన్నట్లు తయారైంది షర్మిల పార్టీ పరిస్థితి. చెప్పుకోవడానికి గట్టిగా ఒక్క లీడర్ కూడా లేకుండా పోయారు ఆ పార్టీలో..! ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో నిల్చుంటే.. వైటీపీకి డిపాజిట్లు దక్కడం కూడా కష్టమే అనే అనుమానాలు వినిపిస్తున్న వేళ.. పొత్తుల గురించి షర్మిల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కామెడీ కాకపోతే ఇంకేంటి అనే చర్చ జరుగుతోంది. తెలంగాణ కోడలిని అని తెలంగాణలో పార్టీ పెట్టినా.. ఆంధ్రా బిడ్డగానే చూస్తున్నారు ఇంకా ఆమెను..!
అందుకే ఆమెను ఒక మాట అనడం లేదు. ఆమె ఒక మాట అన్నా రియాక్ట్ కావడం లేదు. పార్టీలన్నీ వైటీపీని దాదాపు లైట్ తీసుకుంటుంటే.. ఒంటరిగానే పోటీ వెళ్తాం.. ఎవరితో పొత్తు లేదు అని షర్మిల కామెంట్లు చేయడం.. పెద్ద కామెడీయే ఇది అంటూ సెటైర్లు వేస్తున్నారు సోషల్ మీడియాలో చాలామంది..!