YS SHARMILA: కాంగ్రెస్‌కు సపోర్టు.. రేవంత్‌పై విమర్శలు.. అంతుచిక్కని షర్మిల స్ట్రాటజీ..
కాంగ్రెస్‌కు మద్దతు అని చెప్పి.. స్టేట్ కాంగ్రెస్ బాస్‌ను తిట్టడం ఏంటి షర్మిల అని తెగ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జనాలు ఇప్పుడు! రేవంత్ రెడ్డి లాంటి దొంగలు.. రాష్ట్రానికి సీఎం కావొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల.
YS SHARMILA: షర్మిల (YS SHARMILA) ఆలోచనలు, అడుగులు ఊహకు అందవ్. పార్టీ పెట్టినప్పుడు అయినా సరే.. ఆ తర్వాత తన కార్యచరణ ప్రకటించినప్పుడైనా సరే.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేద్దామనుకున్నా సరే.. ఆ తర్వాత పోటీ చేస్తానని చెప్పి, పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించినా సరే.. మేడమ్ సార్ మేడమ్ అంతే అంటూ జోకులేస్తున్నారు రాజకీయం తెలిసిన వాళ్లు! ఆడపిల్లను ఆడ పిల్ల అని ఎందుకు అంటారో తెలుసా అని ఆ మధ్య ఓ లాజిక్ చెప్పి కన్ఫ్యూజ్ చేసిన షర్మిల.. వ్యూహాల విషయంలోనూ ఇలాంటి కన్ఫ్యూజనే క్రియేట్ చేస్తున్నారు.
CPM-CONGRESS: సీపీఎం పోటీతో కాంగ్రెస్‌కే నష్టం.. ఓట్ల చీలికతో బీఆర్ఎస్‌కు లాభం..
ఇప్పుడిదంతా ఎందుకూ అంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన షర్మిల.. కాంగ్రెస్ (CONGRESS)కు మద్దతు ప్రకటించారు. కథ సుఖాంతం అనుకుంటున్న సమయంలో ఇంకో ప్రెస్‌మీట్ పెట్టారు. రేవంత్ రెడ్డి (REVANTH REDDY) మీద విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు మద్దతు అని చెప్పి.. స్టేట్ కాంగ్రెస్ బాస్‌ను తిట్టడం ఏంటి షర్మిల అని తెగ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జనాలు ఇప్పుడు! రేవంత్ రెడ్డి లాంటి దొంగలు.. రాష్ట్రానికి సీఎం కావొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు ఇంకా కొనసాగుతోందన్న విషయాన్ని గుర్తుచేశారు కూడా! కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పిన షర్మిల.. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విమర్శించడం.. హాట్ టాపిక్‌గా మారింది. పార్టీకి మద్దతిస్తూ.. అధ్యక్షుడిని విమర్శించడమేంటనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ఐతే దీని వెనక రకరకాల కారణాలు వినిపిస్త్నాయ్. వైటీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు గతంలో షర్మిల ప్రయత్నాలు చేశారు. నేరుగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. ఐతే కాంగ్రెస్‌లో ఆమె చేరికను రేవంత్ రెడ్డి అడ్డుకున్నట్లు ప్రచారం జరిగింది.
TELANGANA CONGRESS: కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లోకి.. బండి సంజయ్ చెప్పిందే జరగబోతుందా..?
ఆయన అడ్డుకోవడం వల్లే.. కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనం కాలేదనే వార్తలు వచ్చాయ్. అప్పటినుంచీ రేవంత్ రెడ్డిపై షర్మిల గుర్రుగా ఉన్నారని.. అందుకే ఆయనను టార్గెట్ చేసి చేసుకొని విమర్శలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. కారణం ఏదైనా.. షర్మిల కన్ఫ్యూజన్ ఇంకా క్లియర్ అయినట్లు కనిపించడం లేదు. ఐతే షర్మిల తానే ఈ మాటలు అన్నారా.. లేదంటే వెనక ఉండి ఎవరైనా ఈ మాటలు అనిపించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. బాసూ.. అది కాంగ్రెస్ పార్టీ.. ఏదైనా సాధ్యమే మరి..!