జగన్ రాజీనామా చేయ్: షర్మిల సంచలనం

విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎటువంటి దర్యాప్తు లేదు అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అదానీ నీ బీజేపీ కాపాడుతుందని ఆమె ఆరోపించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 26, 2024 | 06:06 PMLast Updated on: Nov 26, 2024 | 6:08 PM

Ys Sharmila Demand To Ys Jagan

విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎటువంటి దర్యాప్తు లేదు అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అదానీ నీ బీజేపీ కాపాడుతుందని ఆమె ఆరోపించారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. ఇక్కడ చంద్రబాబు కూడా ఎటువంటి యాక్షన్ లేదు అని ఆరోపించారు. 1750 కోట్లు లంచం తీసుకుంటే కనీసం విచారణ లేదన్నారు. అందరు అదానీ కి బయపడుతున్నారు అని ఎద్దేవా చేసారు.

మోడీకి భయపడుతున్నారన్నారు. అన్ని సాక్ష్యాలు ఉన్నాయని అమెరికా FBI చెప్పినా దర్యాప్తు చేయడం లేదని చంద్రబాబు ను ఏమనుకోవాలి ? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ను డిమాండ్ చేస్తున్నాం… వెంటనే విచారణ కమిటీ వేయండని ఆమె డిమాండ్ చేసారు. ఈ రాష్ట్రంలో వైసిపి రాజ్యాంగాన్ని గౌరవించడం లేదన్నారు. గెలిచిన ఎంఎల్ఏ అసెంబ్లీకి వెళ్ళాలి అనేది రాజ్యాంగం చెప్తుందని కానీ వీళ్లు మాత్రం అసెంబ్లీకి పోలేదు అని మండిపడ్డారు. అసెంబ్లీ కి పోనీ వాళ్ళు రాజ్యాంగం ప్రకారం రాజీనామాలు చేయండని ఆమె డిమాండ్ చేసారు.