మా వదిననే తిడతారా ? వాడిని నడి రోడ్డు మీద ఉరి తీయాలి
వైఎస్ భారతి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు అనిల్ మీద ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సీరియస్ అయ్యారు. ఇలాంటి వాన్ని నడిరోడ్డులో పెట్టి ఉరి తీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్ భారతి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు అనిల్ మీద ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సీరియస్ అయ్యారు. ఇలాంటి వాన్ని నడిరోడ్డులో పెట్టి ఉరి తీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్ల మీద ఇలాంటి కామెంట్స్ చేయడం ఉన్మాదంతో సమానమన్నారు. ఇలాంటి నీచ సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీనే అంటూ పోస్ట్ చేశారు. ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా క్షమించేది లేదన్నారు. నిందితులు చేబ్రోలు కిరణ్ విషయంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. తప్పుడు కూతలు కూసే వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్‌టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కూడా కఠిన చర్యలు ఉండాల్సిందేనన్నారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం అంటూ వైసీపీ, టీడీపీని టార్గెట్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు.. రక్త సంబంధాన్ని మరిచి రాజకీయ కక్ష్యతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగుతున్నారు. మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందుతున్నారు. అన్యం పుణ్యం ఎరుగని పసి పిల్లలను సైతం నిందితస్ఉన్నారు. అక్రమ సంబంధాలు అంటగడుతున్న, మీరు పెంచి పోషించిన కాలకేయులే అంటూ పోస్ట్ చేశారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.