మోడీ చేతకాని వాడా…? షర్మిల సంచలనం
అదానీ పై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని... ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏసీబీ నిద్రపోతుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
అదానీ పై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని… ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏసీబీ నిద్రపోతుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. సోలార్ పవర్ డీల్ లో జగన్ కి 1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడి అయ్యిందని ఈ విషయాన్ని అమెరికా FBI వెల్లడించినా… ఆధారాలు కూడా బయట పెట్టినా మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా ? అని ఆమె ప్రశ్నించారు. ఇంత అవినీతి జరిగితే మన రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదు ? అంటూ నిలదీశారు.
చంద్రబాబు ను అడుగుతున్నాం.. అదానీ మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ? అదానీ అనే పేరు కూడా ఎందుకు ఉచ్ఛరించడం లేదు ? అదానీ బీజేపీ మనిషి..మోడీ మనిషి. బీజేపీ తో మీకు అలయెన్స్ ఉంది… అందుకే మీరు అదానీ కి, మోడీ కి బయపడుతున్నారు అని మండిపడ్డారు. అదానీ నీ కాపాడుతున్నారు అని ఆరోపించారు. మొత్తం దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారన్నారు. అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్తే కానీ అవినీతి బయటకు రాలేదు ? అని ఆమె మండిపడ్డారు. మోడీ చేతకాని వాడా ? అంటూ షర్మిల మండిపడ్డారు. ఏసీబీని పంజరంలో బంధించారని ఆమె ఆరోపించారు.