YS SHARMILA: మద్యపాన నిషేధం అని చెప్పి నాసిరకం మద్యం అమ్ముతారా.. జగన్‌పై షర్మిల ఫైర్

ఎంపీలంతా రాజీనామా చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు రాదని ప్రశ్నించారు. ఈ మాటలు నమ్మి జగన్‌ను ప్రజలు గెలిపించారు. జగన్.. సీఎం అయ్యాక ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా? అధికారంలోకి వచ్చాక వైసీపీ ఎంపీలు పదవులకు రాజీనామా చేశారా..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 26, 2024 | 07:55 PMLast Updated on: Feb 26, 2024 | 7:55 PM

Ys Sharmila Fires On Ap Cm And Ysrcp Leader Ys Jagan

YS SHARMILA: అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తానని జగన్ చెప్పారని, కానీ, ఇప్పుడు ప్రభుత్వమే నాసిరకం మద్యాన్ని అమ్ముతోందని విమర్శించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అనంతపురంలో నిర్వహించిన ‘కాంగ్రెస్‌ న్యాయ సాధన సభ’లో షర్మిల మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. “నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్‌ ప్రత్యేక హోదాను విస్మరించారు.

PAWAN KALYAN: ఒకే స్క్రీన్ మీద.. పవన్, ప్రభాస్, నాని..

ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. హోదా కోసం గతంలో జగనన్న దీక్షలు చేశారు. ఎంపీలంతా రాజీనామా చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు రాదని ప్రశ్నించారు. ఈ మాటలు నమ్మి జగన్‌ను ప్రజలు గెలిపించారు. జగన్.. సీఎం అయ్యాక ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా? అధికారంలోకి వచ్చాక వైసీపీ ఎంపీలు పదవులకు రాజీనామా చేశారా..? అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. ఇప్పుడేమో ప్రభుత్వం ద్వారానే నాసిరకం మద్యం అమ్ముతున్నారు. ఒక్కమాట కూడా నిలబెట్టుకోని జగన్‌. వైఎస్సార్‌ వారసుడు ఎలా అవుతారు? అధికారంలోకి రాగానే 23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయి కాబట్టి.. హడావుడిగా 6వేల పోస్టులతో దగా డీఎస్సీ వేశారు. జగన్‌ తన పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా..? గతంలో జగనన్న కోసం 3 వేల కి.మీ పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టాను.

కానీ, ఇప్పుడు సొంత చెల్లిని అని కూడా చూడకుండా నాపై, నా భర్తపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారు. నేను ఒక మహిళను అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించి అడ్డుకున్నారు. జగన్‌.. మీరు ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కోసమే ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టా. నేను వైఎస్సార్ బిడ్డని’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.