YS SHARMILA: ఏపీ కాంగ్రెస్‌కు ఇన్ని దరఖాస్తులా.. షర్మిల గోల్డెన్ లెగ్ అయ్యారా?
రాష్ట్రాన్ని విభజించారన్న కోపంతో.. పదేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు కనీసం చూడలేదు. పదేళ్ల నుంచి ఏపీ అసెంబ్లీలో.. కాంగ్రెస్ సభ్యులకు అవకాశం దొరకలేదు. చాన్స్ కాదు కదా.. కనీసం డిపాజిట్లు రాలేదు.
YS SHARMILA: షర్మిల పార్టీ పగ్గాలు అందుకున్న తర్వాత.. ఏపీ కాంగ్రెస్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. పుంజుకుందా.. అలా అనిపిస్తుందా అన్న సంగతి పక్కనపెడితే.. అంతో.. ఇంతో, అక్కడో.. ఇక్కడో మిగిలిన కాసింత మంది కాంగ్రెస్ కార్యకర్తల్లో ఇప్పుడు కొత్త జోష్ కనిపిస్తోంది. రాష్ట్రాన్ని విభజించారన్న కోపంతో.. పదేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు కనీసం చూడలేదు. పదేళ్ల నుంచి ఏపీ అసెంబ్లీలో.. కాంగ్రెస్ సభ్యులకు అవకాశం దొరకలేదు. చాన్స్ కాదు కదా.. కనీసం డిపాజిట్లు రాలేదు.
KCR MEDIGADDA: అక్రమాల మేడిగడ్డ చూసొద్దాం.. కేసీఆర్‌కు రేవంత్ ఆహ్వానం
ఇక పార్లమెంట్ సంగతి సరేసరి. ఏపీ నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరూ పదేళ్ల నుంచి ఎన్నిక కాలేదు. పోటీ చేసేందుకు అభ్యర్థులే కరవయ్యారు ఓ సమయంలో ! షర్మిల.. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న తర్వాత సీన్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ తరఫున పోటీ చేసేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయ్. దీంతో కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. షర్మిల పర్యటనకు జనాలు భారీగానే వస్తున్నారు. రాజన్న రచ్చబండ పేరుతో ఆమె చేపట్టిన కార్యక్రమానికి.. మంచి స్పందన కనిపిస్తోంది. దీంతో ఇన్నాళ్లు కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న నాయకులు.. నెమ్మదిగా హస్తం పార్టీకి దగ్గరవుతున్నారు. ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన నేతలు.. ఇప్పుడు రోడ్డు మీదకు వస్తున్నారంటే కాంగ్రెస్ కొంత పుంజుకున్నట్లే అని.. ఆ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఇదే నిజమా అంటే.. ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేం.
ఐతే ఇదంతా ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతలు రండి అంటూ.. కాంగ్రెస్ కొద్దిరోజులుగా అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. దీనికి కూడా మంచి స్పందనే లభిస్తోంది. భారీగా అప్లికేషన్స్ వస్తున్నాయ్. దీంతో కాంగ్రెస్ నేతల్లో నమ్మకం మరింత పెరిగినట్లు అయింది. ఈసారి ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని.. చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 793 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 25 పార్లమెంటు స్థానాలకు 105 మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరి రోజు మరిన్ని అప్లికేషన్స్ రావొచ్చు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.