YS SHARMILA: బినామీల ఉచ్చులో షర్మిల! నిజమెంత? ఏం జరిగింది ?

అప్పట్లో రేవంత్‌ రెడ్డి.. మీడియా సాక్షిగా అమోద గ్రూప్స్‌ మీద సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంస్థకు వైఎస్‌ షర్మిల అండగా ఉన్నారని.. వీళ్లంతా షర్మిల బినామీలంటూ చెప్పారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 28, 2023 | 08:12 PMLast Updated on: Dec 28, 2023 | 8:12 PM

Ys Sharmila Involved In Amoda Group Of Companies Make Her In Trouble

YS SHARMILA: అమోద గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌.. బయ్యారం మైనింగ్‌ వ్యవహారంలో అప్పట్లో ఈ పేరు బాగా వినిపించింది. మైనింగ్‌ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రేవంత్‌ రెడ్డి.. మీడియా సాక్షిగా అమోద గ్రూప్స్‌ మీద సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంస్థకు వైఎస్‌ షర్మిల అండగా ఉన్నారని.. వీళ్లంతా షర్మిల బినామీలంటూ చెప్పారు. ఈ వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని కూడా డిమాండ్‌ చేశారు.

Ranbir Kapoor: వివాదంలో రణ్‌బీర్ కపూర్.. మతపరమైన మనోభావాలు దెబ్బతీశారని ఫిర్యాదు

ఇప్పుడు అదే అమోద గ్రూప్స్‌ పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. ఆ గ్రూప్‌ ఎండీ మమ్మల్ని మోసం చేశాడు అంటూ కొందరు బాదితులు రోడ్డెక్కారు. కపడలోని ఐరన్‌ ఓర్‌ క్వారీల్లో తమ లారీలు వాడుకుని, డబ్బులు ఇవ్వలేదంటూ వాపోతున్నారు. వాళ్లంతా చెప్పేది చిన్న లెక్క కాదు. ఉన్నది ఒక్కరో ఇద్దరో కాదు. దాదాపు వంద మందికి పైగా ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారులను అమోద సంస్థ మోసం చేసి కోట్ల రూపాయలు వెనకేసుకుందని చెప్తున్నారు బాధితులు. వాళ్లంతా ప్రాణ భయంతో బయటికి రావడంలేదని చెప్తున్నారు. ఆస్తులు కోల్పోయి, పిల్లల పెళ్లిళ్లు చేయలేక.. వేరే గత్యంతరం లేక తాము రోడ్డుమీదకు వచ్చామంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు.

దాదాపు నాలుగేళ్ల నుంచి పెండింగ్‌ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని.. గట్టిగా అడిగితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని చెప్తున్నారు. బాధితులందరికీ కలిపి అమోద సంస్థ దాదాపు రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్తున్నారు. సంస్థ ఎండీగా ఉన్న కొండల్‌ రావు, సతీష్‌ ఇద్దరూ షర్మిల అనుచరులని.. ఆ కారణంగానే ఎవరూ వాళ్లను ఎదిరించలేకపోతున్నారంటూ చెప్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే పోలీసులు కనీసం తమ కేసు కూడా తీసుకోవడంలేదని తమ అసహాయతను తెలుపుతున్నారు.

ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో రేవంత్‌ రెడ్డి కూడా ఈ సంస్థ మీద ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి.