అన్న అరెస్ట్ కోసం చూస్తుందా…? షర్మిల రివెంజ్ మోడ్ లో ఉందా…?

తగలబడుతున్న ఇంట్లోకి తిరగబడ్డ ఆడదాని జోలికి వెళ్ళకూడదు అంటూ... చెన్నకేశవ రెడ్డి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఆ సీన్ లో భార్య... వైఎస్ జగన్ సీన్ లో చెల్లెలు. తెలంగాణాకు పరిమితం అవుతుందని షర్మిలను తక్కువ అంచనా వేసి... సోషల్ మీడియాలో తన సైన్యం చేత నానా కూతలు కూయించిన జగన్... ఇప్పుడు పర్యావసానాలు ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 27, 2024 | 08:35 PMLast Updated on: Nov 27, 2024 | 8:35 PM

Ys Sharmila On Revange Mode

తగలబడుతున్న ఇంట్లోకి తిరగబడ్డ ఆడదాని జోలికి వెళ్ళకూడదు అంటూ… చెన్నకేశవ రెడ్డి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఆ సీన్ లో భార్య… వైఎస్ జగన్ సీన్ లో చెల్లెలు. తెలంగాణాకు పరిమితం అవుతుందని షర్మిలను తక్కువ అంచనా వేసి… సోషల్ మీడియాలో తన సైన్యం చేత నానా కూతలు కూయించిన జగన్… ఇప్పుడు పర్యావసానాలు ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ నేతలు షర్మిల విషయంలో సంబంధం లేకుండా మాట్లాడుతూ ఆమెను నానా మాటలు అన్నారు. సాధారణంగా తిడితే సైలెంట్ గా ఉండే రకం కాదు షర్మిల.

ఆమెను ఒక మాట అంటే వంద మాటలు అనడానికి రెడీగా ఉంటుంది. షర్మిలను వైసీపీ నేతలు అర్ధం లేని ఆరోపణలతో విమర్శించినా… ఆమె మాత్రం సూటిగా తగిలే సబ్జెక్ట్ ఉన్న కామెంట్స్ తో టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఆస్తుల విషయంలో అదే జరిగింది. షర్మిల… అటాక్ చేయడం మొదలుపెట్టిన తర్వాత… వైసీపీ నేతల దూకుడు తగ్గింది. తన పార్టీకి ఓటు షేర్ లేదని… అసలు మాట్లాడే అవసరం కూడా లేదని జగన్ చేసిన కామెంట్స్ కు షర్మిల ఇచ్చిన కౌంటర్ కు వైసీపీ నేతల మైండ్ బ్లాక్ అయింది. నాకు 40 శాతం లేకపోయినా ప్రజల్లో ఉన్నా అంటూ కౌంటర్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు అదాని వ్యవహారంలో షర్మిల చాలా దూకుడుగా ఉన్నారు. అధానిని టార్గెట్ చేసే క్రమంలో జగన్ ను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ కేసులో విచారణ జరిపి… అప్పటి ప్రభుత్వ పెద్దలను, మాజీ మంత్రులను, అధికారులను అరెస్ట్ చేయాలి అంటూ ఆమె డిమాండ్ లు చేస్తున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా జగన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు ఇప్పటికే షర్మిల ఓ లేఖ కూడా రాసి… జగన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు.

అలాగే ఏపీ గవర్నర్ ను కూడా ఇదే అంశంపై ఆమె విజ్ఞప్తి చేసారు. విచారణకు ఆదేశించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇలా షర్మిల ప్రస్తుతం అటాకింగ్ మోడ్ లో ఉండి… జగన్ ను ఎలా అయినా అరెస్ట్ చేయించాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల చేసే పర్యటనలలో కూడా జగన్ ను ఎక్కువగా టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా గత ప్రభుత్వ లోపాలు, జగన్ తప్పులు అంటూ ఆమె విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబును తిడుతున్నా అవి ఎక్కువగా జగన్ నే టార్గెట్ గా చేసుకుని చేస్తున్న విమర్శలుగా కనపడుతున్నాయి.

తనను వేధించిన వారి విషయంలో ఆమె సీరియస్ గానే ఉన్నారు. గతంలో జగన్ ఏ తరహా రాజకీయం చేసేవారో ఆమె వివరించే ప్రయత్నం చేస్తూ పదే పదే జగన్ లక్ష్యంగా మీడియా సమావేశాలు పెడుతున్నారు. బాలకృష్ణ ఇంట్లో కూర్చుని షర్మిలను తిట్టారు అని జగన్ చేసిన కామెంట్స్ కు టీడీపీ కంటే ముందే షర్మిల రియాక్ట్ అయ్యారు. అయిదేళ్ళు సీఎంగా ఉండి మీరు ఏం పీకారు అంటూ మాట్లాడారు షర్మిల. ఇక ప్రభాస్ కు తనకు ఏ సంబంధం లేదని బిడ్డలపై కూడా షర్మిల ప్రమాణం చేసారు. ఆస్తుల విషయంలో కుడా అలాగే ప్రమాణం చేసారు. మరి భవిష్యత్తులో షర్మిల రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.