వాడ్ని కాపాడింది సాయి రెడ్డే: షర్మిల సెన్సేషనల్ కామెంట్స్
వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడింది విజయసాయి రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు వైఎస్ షర్మిల. విజయసాయి రెడ్డి రాజీనామాపై మీడియాతో మాట్లాడిన షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడింది విజయసాయి రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు వైఎస్ షర్మిల. విజయసాయి రెడ్డి రాజీనామాపై మీడియాతో మాట్లాడిన షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జగన్ ఏం చెప్తే అది చేసే వ్యక్తి సాయి రెడ్డి అని.. అలాంటి వ్యక్తి వైసీపీకి రాజీనామా చేయడం చిన్న విషయం కాదన్నారు షర్మిల. జగన్ ఏ పని ఆదేశిస్తే…ఆ పని చేయడం.. ఎవరిని తిట్టమంటే వాళ్ళను తిట్టడం సాయి రెడ్డి పని అని ఆమె మండిపడ్డారు.
రాజకీయంగా కాదు.. వ్యక్తిగతంగా కూడా.. నా బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయి రెడ్డి అని ఆమె విమర్శించారు. వైసిపి కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆలోచన చేయండని విజ్ఞప్తి చేసారు షర్మిల. జగన్ ను విజయసాయి రెడ్డి వదిలేశారు అంటే ఎందుకు ? సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు వెళ్తున్నారు ? ప్రాణం పెట్టిన వాళ్ళు ఎందుకు జగన్ ను వీడుతున్నారు ? అని ప్రశ్నించారు. జగన్ నాయకుడుగా విశ్వసనీయత కోల్పోయారని నాయకుడుగా ప్రజలను, నమ్ముకున్న వాళ్ళను మోసం చేశారని విమర్శించారు. వివేకా హత్య కేసులో విజయసాయి రెడ్డి మరిన్ని నిజాలను బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేసారు.