లడ్డుపై తగ్గని షర్మిల, సంచలన కామెంట్స్

తిరుమల లడ్డూ కల్తీపై ఇవ్వాళ గౌరవ సుప్రీంకోర్టు చేసిన సూచన.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిదన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేంద్రం దర్యాప్తు చేయాలని, సిబిఐ తో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముందునుంచే వాదిస్తోందన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 30, 2024 | 04:30 PMLast Updated on: Sep 30, 2024 | 9:04 PM

Ys Sharmila Sensational Comments On Tirumala Laddu Issue

తిరుమల లడ్డూ కల్తీపై ఇవ్వాళ గౌరవ సుప్రీంకోర్టు చేసిన సూచన.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిదన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేంద్రం దర్యాప్తు చేయాలని, సిబిఐ తో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముందునుంచే వాదిస్తోందన్నారు. ఇవ్వాళ సుప్రీం ఇచ్చిన సూచన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కి బలం చేకూరినట్లయ్యిందని పేర్కొన్నారు. సిట్ దర్యాప్తు రబ్బర్ స్టాంప్ తప్పా.. విచారణకు ఉపయోగం లేదని స్పష్టం చేసారు. సిబిఐకి అప్పగిస్తేనే లడ్డూ కల్తీపై లోతైన దర్యాప్తు జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజానిజాలు వెల్లడవుతాయన్నారు. కల్తీ ఎలా జరిగింది ? ఎక్కడ జరిగింది ? పాల్పడ్డ దొంగలు ఎవరు ? అని ఆమె నిలదీశారు. తక్కువ ధరకు కాంట్రాక్టు ఇవ్వడం వెనుక కారణం ఏంటి ? అని ప్రశ్నించారు. NDDB రిపోర్ట్ ను ఎందుకు ఇంతకాలం దాచిపెట్టారు ? మత రాజకీయాలకు ఆజ్యం పోసింది ఎవరు ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. నిందితులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉందని కోరారు. కూటమి సర్కారును మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం… దెబ్బతిన్న హిందువుల మనోభావాలు మీకు ముఖ్యం అనుకుంటే మత రాజకీయాలు మీ అజెండా కాకపోతే లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.