YS SHARMILA: కొడుకు పెళ్లి కోసమేనా.. లోకేశ్‌కు షర్మిల గిఫ్ట్ వెనక ఇంత కథ ఉందా..?
లోకేశ్‌కు షర్మిల గిఫ్ట్ పంపించడం ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరుగుతోంది.
YS SHARMILA: ఏదో రకంగా వార్తల్లో కనిపించే వ్యక్తుల్లో, లీడర్లలో వైఎస్ షర్మిల ముందుంటారు. రాజన్న రాజ్యం అంటూ తెలంగాణలో పార్టీ పెట్టారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఐనా సరే ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. దీంతో వాస్తవం కళ్ల ముందు కదిలింది. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసే ప్రయత్నం చేశారు. అదీ కుదరలేదు. పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు కూడా లేకపోవడంతో.. చివరికి కాంగ్రెస్‌కే సపోర్ట్ అంటూ ప్రకటన చేశారు.
PAWAN KALYAN: అయ్యో పవన్ ! డిప్యూటీగా కూడా పనికిరాడా..? జనసేనాని పరువు తీస్తున్న లోకేష్
ఐతే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో షర్మిల పరిస్థితి ఏంటి అని చర్చ జరుగుతున్న సమయంలో ఓ హఠాత్ పరిణామం జరిగింది. లోకేశ్‌కు షర్మిల గిఫ్ట్ పంపించడం ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరుగుతోంది. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ గిఫ్ట్‌లు పంపగా.. షర్మిల ఇచ్చిన బహుమతులు బాగున్నాయని ఆయన ట్వీట్ చేయడం కొత్త చర్చకు కారణం అయింది. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌కు చెల్లి అయి ఉండి.. ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీకి చెందిన లోకేశ్‌కు షర్మిల గిఫ్ట్‌లు పంపడం ఏంటి అనే ప్రశ్నలు వినిపించడం స్టార్ట్ అయ్యాయ్. ఈ దోస్తీ వెనక మతలబు ఏంటా అని సోషల్ మీడియాలో ఎవరికి వారు చర్చించడం మొదలుపెట్టారు. జగన్‌కు, షర్మిలకు పడడం లేదని.. అందుకే దూరంగా ఉంటున్నారనే ప్రచారం ఉంది.
CHANDRABABU NAIDU: బాబు ఇండియా కూటమికి వెళ్తారా..? మరి పవన్ పరిస్థితి ఏంటి ?
జగన్ మీద పైచేయి సాధించేందుకు, ప్రతీకారం తీర్చుకునేందుకు షర్మిల ఇలా చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతుంటే.. మరికొందరు మాత్రం దీనికి భిన్నమైన వాదన తెరమీదకు తీసుకువస్తున్నారు. షర్మిల కొడుక్కి త్వరలో పెళ్లి జరగబోతోంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రియా అట్లూరిని ప్రేమించి.. పెద్దల అంగీకారంతో ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు. అందుకే నారా ఫ్యామిలీతో షర్మిల సన్నిహితంగా ఉంటున్నారా అని సోషల్ మీడియా సాక్షిగా కొత్త చర్చకు తెరలేపారు. పుట్టినరోజు కూడా తన అన్నకి బర్త్‌డే విషెస్ చెప్పని షర్మిల.. క్రిస్మస్‌కు లోకేశ్‌కు ప్రత్యేకంగా గిఫ్ట్‌లు పంపారు అంటే.. పెద్ద కథే ఉందని గుసగుసలాడుకుంటున్నారు. ఈ విషయం మీద వైసీపీ ఫ్యాన్స్ చాలా కోపంతో కనిపిస్తున్నారు. సొంత అన్న పుట్టినరోజుకి విషెస్ చెప్పడం తెలియదు కానీ.. క్రిస్మస్‌కి లోకేశ్‌కు గిఫ్ట్‌లు పంపడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏమైనా లోకేశ్‌కు గిఫ్ట్‌లు పంపడం వెనక అసలు కారణం మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. జగన్ మీద ప్రతీకారం తీర్చుకునేందుకే ఇదంతా అని కొందరు అంటుంటే.. కొడుకు పెళ్లికోసమే ఇది అని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. అసలు నిజం ఏంటో మరి కాలమే సమాధానం చెప్పాలి మరి అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.