YS SHARMILA: ఇదేందయ్యా ఇది.. రేవంత్ మీద పోటీ చేయకుండా ఆపిన షర్మిల..
రేవంత్ ఓ దొంగ అని.. ఆయన ఎలా సీఎం అవుతారు అంటూ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తానని చెప్పి.. రేవంత్‌ను తిట్టడం ఏంటి అనే కన్ఫ్యూజన్‌లో జనాలు ఉన్న సమయంలో.. మరో ఝలక్ ఇచ్చారు షర్మిల. రేవంత్ రెడ్డి మీద వైటీపీ నుంచి పోటీ చేయాలనుకున్న అభ్యర్థిని షర్మిల ఆపేశారు.
YS SHARMILA: వైటీపీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (YS SHARMILA) చర్యలు ఊహాతీతం అనిపిస్తున్నాయ్ వరుస పరిణామాలు చూస్తుంటే ! పార్టీ పెట్టారు.. పాదయాత్ర చేశారు. నిరాహార దీక్షకు దిగారు. ఎన్ని చేసినా వర్కౌట్ కాలేదు. పొలిటికల్‌గా కాస్త కూడా మైలేజ్ రాలేదు. దీంతో ఇక లాభం లేదు అనుకొని పార్టీని కాంగ్రెస్‌లో కలిపేందుకు డిసైడ్ అయ్యారు. ఐతే అది కూడా సక్సెస్ కాలేదు. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసే ప్రక్రియకు.. బ్రేకులు పడ్డాయ్. దీంతో సొంతంగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఏమైందో ఏమో కానీ.. తర్వాత మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. పోటీ నుంచి తప్పుకుంటున్నామని.. కాంగ్రెస్‌కే ఫుల్ సపోర్ట్ అని మీడియా ముందు చెప్పి మరీ షాక్ ఇచ్చింది.
Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
పొంగులేటిని పాలేరులో గెలిపించేందుకు సపోర్ట్ చేస్తానని డైరెక్ట్‌గా చెప్పేసింది. ఇక అంతా హ్యాపీస్ అని అనుకుంటున్న సమయంలో.. మళ్లీ టోన్ మార్చారు షర్మిల. రేవంత్‌పై ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ ఓ దొంగ అని.. ఆయన ఎలా సీఎం అవుతారు అంటూ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తానని చెప్పి.. రేవంత్‌ను తిట్టడం ఏంటి అనే కన్ఫ్యూజన్‌లో జనాలు ఉన్న సమయంలో.. మరో ఝలక్ ఇచ్చారు షర్మిల. రేవంత్ రెడ్డి (REVANTH REDDY) మీద వైటీపీ నుంచి పోటీ చేయాలనుకున్న అభ్యర్థిని షర్మిల ఆపేశారు. వైటీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు.. కామారెడ్డి నుంచి రేవంత్ మీద పోటీ చేయాలని భావించారు. ఐతే సుధాకర్‌ను పిలిచి మాట్లాడిన షర్మిల.. పోటీ నుంచి తప్పుకోవాలని సూచించారు. షర్మిల ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తామని నీలం సుధాకర్ ప్రకటించారు.
MLC Kavitha : బోధన్ ర్యాలీ పాల్గొనేందుకు.. బైక్ పై వెళ్లిన ఎమ్మెల్సీ కవిత..
ఐతే ఆయనను పిలిచి షర్మిల మాట్లాడడం కొత్త చర్చకు కారణం అవుతోంది. రేవంత్‌ను అంతలా తిట్టి.. మళ్లీ ఇప్పుడు అదే రేవంత్ మీద పోటీ చేయాలనుకున్న వ్యక్తిని వద్దు అనడం ఏంటి.. ఆయనకు నచ్చజెప్పడం ఏంటని జుట్టు పీక్కుంటున్నారు జనాలు. ఏమైనా షర్మిల చర్యలు ఊహాతీతం బాస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో.