YS SHARMILA: జగనన్న పైకి బాణం.. ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల..?
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌తో విభేదాల కారణంగా తెలంగాణకు వచ్చి వైఎస్సార్టీపీ పెట్టుకున్నారు షర్మిల. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి సైడ్ అయ్యారు. షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకోడానికి.. రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఎవరూ ఇష్టపడలేదు.
YS SHARMILA: ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం.. అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు ఆయన మీదకే వస్తోంది. జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీని ఆదుకొని.. ఆ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ అంతటా తిరిగిన జగన్ చెల్లెలు షర్మిల.. ఏపీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారని తెలుస్తోంది. జనవరి ఫస్ట్ వీక్‌లో ఆమె ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది. ప్రస్తుతం షర్మిలను స్టార్ క్యాంపెయినర్‌గా నియమిస్తారనీ.. అసెంబ్లీ ఎన్నికల నాటికి కీలక పదవి ఇవ్వొచ్చని చెబుతున్నారు.
DENSE FOG: ప్రాణం తీస్తున్న పొగమంచు.. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న మంచు
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌తో విభేదాల కారణంగా తెలంగాణకు వచ్చి వైఎస్సార్టీపీ పెట్టుకున్నారు షర్మిల. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి సైడ్ అయ్యారు. షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకోడానికి.. రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఎవరూ ఇష్టపడలేదు. ఇక్కడ ఆమెను తీసుకుంటే పార్టీ డ్యామేజ్ అవుతుందనీ.. ఆంధ్రప్రదేశ్‌లో చేర్చుకుంటే బెటర్ అని సలహా ఇచ్చారు. దాంతో ఇప్పుడు షర్మిలను ఏపీ కాంగ్రెస్‌లోకి తీసుకోడానికి అంతా రెడీ అయింది. చర్చలు పూర్తయ్యాయనీ.. జనవరి మొదటి వారంలో ఆమె ఢిల్లీలోనే AICC పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరతారని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ఇచ్చిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ 10 యేళ్ళుగా కోలుకోలేకపోయింది. ఇప్పుడు పొరుగునే ఉన్న కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి రావడం.. జగన్‌కు వ్యతిరేకంగా షర్మిలను దించడం ద్వారా మళ్ళీ పుంజుకోవచ్చని AICC భావిస్తోంది. తమ ఓటు బ్యాంక్ అంతా జగన్‌కు వెళ్ళిపోయింది.. షర్మిల ద్వారా తిరిగి వాళ్ళని తెచ్చుకోవాలని చూస్తోంది. అంతేకాకుండా.. ఇప్పుడు వైసీపీలో సిట్టింగ్స్‌కు టిక్కెట్లు ఇవ్వకపోవడంతో చాలా మంది నేతల్లో అసంతృప్తి చెలరేగుతోంది.
వాళ్ళందర్నీ తమ పార్టీలోకి రప్పించాలన్న ప్లాన్‌లో ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు. ఇప్పటికే వైసీపీలో ఉన్న లీడర్లలో కొందరు జగన్ వ్యవహారశైలి నచ్చకపోయినా.. టీడీపీ, జనసేనలోకి వెళ్ళలేక అక్కడే ఉంటున్నారు. అలాంటి వాళ్ళంతా షర్మిల చేరికతో కాంగ్రెస్‌లోకి వస్తారని AICC భావిస్తోంది. అయితే రేపు పార్టీలో చేరిన తర్వాత.. జగన్ పెట్టే ఒత్తిడిని షర్మిల తట్టుకుంటారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈనెల 27న ఏపీ కాంగ్రెస్ నేతలతో AICC అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ అవుతున్నారు. ఈ మీటింగ్‌లో షర్మిల చేరికతోపాటు రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడే అవకాశమంది. ఏపీలో పొత్తులపైనా చర్చించనున్నట్టు సమాచారం.