YS SHARMILA: ఏపీకి ప్రత్యేకహోదా కోసం షర్మిల దీక్ష.. జాతీయ నేతలతో భేటీ..
తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది షర్మిల. ప్రత్యేక హోదా కోసం గళమెత్తుతున్నారు. ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాశారు. వైఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైసీపీ.. ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోలేదన్నారు.
YS SHARMILA: ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే సంగతి పక్కనబెడితే.. షర్మిల మాత్రం ఏదో ఒక రకంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కాంగ్రెస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది షర్మిల. ప్రత్యేక హోదా కోసం గళమెత్తుతున్నారు.
Poonam Pandey: పూనమ్ పాండే మరణం.. వ్యాక్సిన్‌పై మళ్లీ చర్చ..
ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాశారు. వైఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైసీపీ.. ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోలేదన్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబును కూడా విమర్శించారు. ఇప్పుడు ఈ అంశాన్ని ఢిల్లీ వేదికగా మరోసారి తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది షర్మిల. శుక్రవారం సాయంత్రం ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేపడుతోంది. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద దీక్షకు సిద్ధమైంది. ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏపీ, తెలంగాణ నేతలతోపాటు పలువురు జాతీయ నేతలు కూడా హాజరుకాబోతున్నారు. అంతేకాదు.. ఢిల్లీలో వివిధ పార్టీల మద్దతు కూడగడుతున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో, డీఎంకే ఎంపీ తిరుచి శివతో, కమ్యూనిస్టు లీడర్లతో ఢిల్లీలో షర్మిల సమావేశమయ్యారు.
ఏపీ ప్రత్యేక హోదా అంశానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయా పార్టీల నేతలను కోరారు. తర్వాత కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశమవుతుంది షర్మిల. అయితే, షర్మిల దీక్ష ప్రధానంగా వైసీపీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేసిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ అంశాన్ని గాలికొదిలేశారని షర్మిల విమర్శించింది. ఇప్పుడు షర్మిల ఇదే అంశంపై దీక్ష చేస్తుండటం జగన్ పార్టీకి మింగుడుపడని అంశంగా మారింది.