YS SHARMILA: షర్మిల ఎంట్రీతో ఏపీలో ఏం జరగబోతోంది.. ఏ పార్టీకి లాభం.. ఏ పార్టీకి నష్టం?
కాంగ్రెస్‌లో షర్మిల చేరడం.. ఏపీలో ప్రచారానికి సిద్ధం కావడం.. ఏ పార్టీని ముంచుతుంది.. ఏ పార్టీకి మేలు చేస్తుందనే చర్చపై రాజకీయవర్గాలు, సామాన్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. షర్మిల చేరికతో లాభం అయ్యేది కాంగ్రెస్‌కే అనే చర్చ జరుగుతోంది.
YS SHARMILA: వైటీపీ అధినేత్రి షర్మిల.. కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం అయింది. ఈ నెల 4న హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ సమక్షంలో.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు షర్మిల. ఆ తర్వాత వరుస ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు షర్మిల. వైఎస్ బ్రాండ్‌తో కోల్పోయిన పార్టీని.. అదే బ్రాండ్‌తో బౌన్స్‌బ్యాక్ అయ్యేలా కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ చేశారు. దీనికోసం షర్మిలను రంగంలోకి దింపారు. ఐతే కాంగ్రెస్‌లో షర్మిల చేరడం.. ఏపీలో ప్రచారానికి సిద్ధం కావడం.. ఏ పార్టీని ముంచుతుంది.. ఏ పార్టీకి మేలు చేస్తుందనే చర్చపై రాజకీయవర్గాలు, సామాన్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.
KESINENI NANI: భారీ డైలాగ్‌లేస్తున్న కేశినేని నాని.. ఇంతకీ ఆయన టార్గెట్ ఎవరు ?
షర్మిల చేరికతో లాభం అయ్యేది కాంగ్రెస్‌కే అనే చర్చ జరుగుతోంది. ఓట్లు వస్తాయా రావా అన్న సంగతి పక్కనపెడితే.. ఆల్‌మోస్ట్ అయిపోయింది అనుకున్న కాంగ్రెస్‌కు.. ఓ ప్లాట్‌ఫామ్ అయితే దొరికే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ దాదాపు క్లీన్‌స్వీప్ అయింది. అక్కడక్కడా నాయకులు తప్పా పెద్దగా కేడర్ లేదు. కాంగ్రెస్ నేతలంతా జగన్ పార్టీలోకే వెళ్లిపోయారు. జనాల్లో ఊపు తెచ్చే నాయకుడు లేడు.. కనీసం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉందని చెప్పడానికి కూడా లేకుండాపోయింది. అలాంటి పార్టీలోకి వైఎస్ఆర్ బిడ్డ షర్మిల చేరుతుండడంతో.. ఆ పార్టీకి అంతో ఇంతో మైలేజీ వస్తుందన్నది కొందరి అభిప్రాయం. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకు ఏపీలో కాంగ్రెస్‌కు ఏ ఒక్కచోట కూడా కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. ఐతే షర్మిల చేరికతో వైఎస్ అభిమానులు, పాత కాంగ్రెస్ అభిమానులు, వైసీపీలోని అసంతృప్తులు, ఇతర పార్టీల్లో టికెట్లు, పదవులు దొరకని వారు కాంగ్రెస్‌లో చేరితే కనీసం డిపాజిట్లు దక్కే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికిప్పుడు షైన్ అవుతుందని కాదు కానీ.. జీరో స్టేజీ నుంచి కాస్త లైమ్‌లైట్‌లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మరికొందరు.
KTR: పవర్ పోయినా.. పొగరు ఇంకా తగ్గలేదు.. కేటీఆర్‌పై మండిపడుతున్న నెటిజన్లు..
ఇక అటు షర్మిల ఎంట్రీతో.. టీడీపీ, జనసేన మీద పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందన్న దానిపై జనాల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని భావిస్తున్న చంద్రబాబు, పవన్‌కు.. షర్మిల ఎంట్రీతో కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ఐతే షర్మిల రాకతో.. టీడీపీకి ఆయుధం దొరికినట్లు అవుతుందని మరికొందరి వాదన. అన్నాచెల్లెళ్ల పంచాయితీని హైలైట్ చేసి.. జగన్‌ను ఇరుకునపెట్టే వ్యూహాన్ని టీడీపీ అమలు చేసే అవకాశాలు ఉంటాయ్. అన్నపై షర్మిల చేసే విమర్శలను.. తమకు అనుకూలంగా మార్చుకునే చాన్స్ ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇక అటు కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై వైసీపీ నుంచి, జగన్ నుంచి ఇప్పటివరకు పెద్దగా ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఐతే ఆళ్ల రామకృష్ణారెడ్డిలా మరికొందరు వైసీపీ నేతలు.. టికెట్ దక్కకపోతే షర్మిల వెంట నడిచే అవకాశాలు లేకపోలేదు. ఎలా చూసినా.. షర్మిల ఎంట్రీతో వైసీపీ మీదే అంతో ఇంతో ఎఫెక్ట్ కనిపించడం ఖాయం అనే చర్చ జరుగుతోంది. ఇక అటు కాంగ్రెస్‌లో చేరి ఏపీలో బాధ్యతలు తీసుకోవడం అంటే.. షర్మిలకు ఇది రాజకీయంగా పెద్ద సవాల్‌లాంటిదే! కాస్త అటు ఇటు అయినా.. పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఐతే కాంగ్రెస్ నుంచి షర్మిలకు స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలుస్తోంది. మూడు ఆప్షన్లను.. ఆమె ముందు ఉంచినట్లు టాక్. ఏమైనా.. షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయం కొత్త మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.