YS SHARMILA: షర్మిల మరో తప్పు చేస్తున్నారా..? ఏపీ కాంగ్రెస్‌లో చేరితే అంతేనా..?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను షర్మిలకు అప్పగించే ఆలోచనలో ఉంది పార్టీ హైకమాండ్‌. ఐతే ఇదే నిజం అయితే.. దీనికి షర్మిల గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. ఆమె మరో తప్పు చేసినట్లే అనే చర్చ జరుగుతోంది. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2023 | 06:22 PMLast Updated on: Dec 27, 2023 | 6:22 PM

Ys Sharmila Will Join Ap Congress Can Ba A Blunder

YS SHARMILA: వైఎస్‌ఆర్‌ తెలంగాణ పేరుతో ఓ పార్టీ ఏర్పాటు చేసి.. షర్మిల చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సింగిల్‌ ఉమెన్‌.. పదుల్లో దీక్షలు.. వందల్లో సభలు.. వేల కిలోమీటర్ల అడుగులు.. అయినా సరే అనుకున్న మైలేజ్‌ మాత్రం రాలేదు ఆమెకు. పార్టీలోకి చేరికలు కాదు కదా.. షర్మిల పార్టీ పేరు ఎత్తడానికి కూడా ప్రత్యర్థులు కనీసం ఇంట్రస్ట్ చూపించలేదంటే అర్థం చేసుకోవచ్చు ఆమె పార్టీ పరిస్థితి. దీంతో లాభం లేదు అనుకొని.. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేద్దామని ఫిక్స్ అయ్యారు.

LPG Cylinder: రూ.500కే గ్యాస్‌ సిలిండర్ పథకం.. వీళ్లే అర్హులు..

ఐతే అది కూడా సక్సెస్‌ కాలేదు. దీంతో పోటీ చేయడానికి అభ్యర్థులు లేక.. సింగిల్‌‌గా పోటీ చేసే ధైర్యం లేక.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు షర్మిల. ఐతే ఆ తర్వాత కూడా కాంగ్రెస్‌ నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. హస్తానికి జై అన్నా.. పార్టీ పెద్దల నుంచి వైఎస్‌ తనయకు ఎలాంటి హామీ లభించలేదు. ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని కాంగ్రెస్ పెద్దలు ఒత్తిడి పెంచినా.. ఆమె మాత్రం తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని ప్రకటిస్తున్నారు ప్రతీసారి. ఐతే ఇప్పుడు ఏపీలో పార్టీకి ఊపు తీసుకువచ్చేందుకు కాంగ్రెస్‌ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను షర్మిలకు అప్పగించే ఆలోచనలో ఉంది పార్టీ హైకమాండ్‌. ఐతే ఇదే నిజం అయితే.. దీనికి షర్మిల గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. ఆమె మరో తప్పు చేసినట్లే అనే చర్చ జరుగుతోంది. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది. పేరుకు పార్టీ ఉంది. గ్రౌండ్‌లెవల్‌లో ఇంచు కూడా బలం లేదు. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు చాలామంది ఇతర పార్టీల్లో చేరిపోయారు.

ఐతే ఇప్పుడు షర్మిలకు ఏపీ పార్టీ బాధ్యతలు అప్పగించినా.. ఆ ప్రభావం పెద్దగా కనిపించే అవకాశం లేదు. ఇప్పటికే షర్మిల తెలంగాణ వాదం ఎత్తుకోవడం, తాను తెలంగాణ బిడ్డనని ప్రకటించడం.. మరింత మైనస్‌ అవుతుంది తప్ప.. ప్లస్‌ కావడం అసాధ్యం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. రాష్ట్రాన్ని విభజించారనే కోపంతో.. కాంగ్రెస్‌కు నామరూపాలు లేకుండా చేశారు ఏపీ జనాలు. అలాంటి పార్టీని ముందుండి నడిపిస్తా అని షర్మిల ప్రయాణం మొదలుపెట్టడం అంటే.. మరిన్ని మీమ్స్‌కు, ట్రోల్స్‌కు బలవడమే అని.. సోషల్‌మీడియాలోనూ చర్చ జరుగుతోంది. షర్మిల రాజకీయ భవిష్యత్‌ కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయ్.