YS SHARMILA: ఏపీలోనూ షర్మిల పని అయిపోయిందా..? పొలిటికల్ కెరీర్‌కు ఇక ఎండ్ కార్డేనా..?
జగన్ టార్గెట్‌గా షర్మిల గుప్పిస్తున్న విమర్శలు, ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. జగన్‌ను మరింత కార్నర్ చేసేలా ఆమె సంధించిన విమర్శలు.. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మైనస్‌గా మారుతుందనే చర్చ మొదలైంది.
YS SHARMILA: అన్నతో పంచాయితీ పెట్టుకున్న షర్మిల.. రాజకీయంగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణ కోడలిని అంటూ వైటీపీ పేరుతో పార్టీ పెట్టి.. కాళ్లు, కీళ్లు అరిగే వరకు వేలకు వేల కిలోమీటర్లు నడిచినా మైలేజ్ రాక.. చివరికి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఏపీలో రాజకీయం మొదలుపెట్టారు. ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి.. జగన్ టార్గెట్‌గా షర్మిల గుప్పిస్తున్న విమర్శలు, ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. జగన్‌ను మరింత కార్నర్ చేసేలా ఆమె సంధించిన విమర్శలు.. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మైనస్‌గా మారుతుందనే చర్చ మొదలైంది. ఇక అటు జగన్‌తో విభేదించి మరీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల.. షర్మిలక్కతోనే నడుస్తానంటూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Alla Ramakrishna Reddy: ఎందుకెళ్లారు.. ఎందుకొచ్చారు..? ఆళ్ల రిటర్న్‌కు షర్మిలే కారణమా?
ఆళ్లను చూసి ఇంకొకళ్లు కాంగ్రెస్‌లోకి వస్తారు అనుకుంటే.. ఒక్క ఎపిసోడ్‌తో సీన్ మొత్తం రివర్స్ అయింది. షర్మిలకు షాక్ ఇస్తూ.. ఆళ్ల మళ్లీ వైసీపీ గూటికి చేరుకున్నారు. అసలే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అంటే మునిగిపోయిన నావ. తెడ్లు వేసి అయినా లేపుదాం అని ప్రయత్నిస్తే.. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఏపీలో షర్మిల పరిస్థితి అయిపోయింది అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌కు ఇప్పుడు పోటీ చేసేందుకు అభ్యర్థులు లేని పరిస్థితి. అందుకే చేరికలను ప్రోత్సహించాలని అధిష్టానం ఫిక్స్ అయింది. ఆళ్ల చేరికతో.. ఇక అన్నీ మంచి శకునములే అనుకున్నారు హస్తం పార్టీ నేతలంతా ! అలాంటిది ఇప్పుడు అదే ఆళ్ల.. కాంగ్రెస్‌కు, షర్మిలకు భారీ షాక్ ఇచ్చారు. వెళ్తూ వెళ్తూ మరిన్ని హాట్ కామెంట్స్ చేశారు. జగన్‌ను తిట్టాలని షర్మిలతో పాటు కాంగ్రెస్ నాయకులు తన మీద ఒత్తిడి చేస్తున్నారని.. రెండుసార్లు తనను ఎమ్మెల్యేను చేసిన జగన్‌ను తిట్టడానికి మనసు రాక.. హస్తం పార్టీని వదులుకున్నానని ఆర్కే అంటున్నారు. అంటే షర్మిల చేసే ప్రతీ ఆరోపణ వెనక ఓ ప్లాన్ ఉందని.. చెల్లి చేస్తున్న విమర్శల వెనక రాజకీయమే ఉంది తప్ప.. నిజం లేదనే ప్రచారం ఇప్పుడు జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
షర్మిల ఎన్ని సభలు పెట్టుకున్నా.. అన్న మీద ఎన్ని ఆరోపణలు చేసినా.. ఆ మాటలో ఘాటు తగ్గే చాన్స్ ఉంటుంది. ఇదంతా ఎలా ఉన్నా.. కాంగ్రెస్‌కు ఇప్పుడు చేరికలు చాలా అవసరం. ఆళ్లను చూసి ఇంకొందరు వస్తారని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఆళ్ల తిరిగి సొంతగూటికి చేరడంతో.. కాంగ్రెస్ వైపు చూసే కొద్దోగొప్పో జనాలు కూడా మొహం తిప్పుకునే అవకాశం ఉంటుంది. ఎలా చూసినా.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బతకడం కాదు కదా.. ఊపిరి అందడం కూడా కష్టమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. తెలంగాణలో పార్టీ పెట్టి.. ఆ తర్వాత దాన్ని విలీనం చేసి ఓ ఓటమిని మూటకట్టుకున్న షర్మిలకు.. ఏపీలోనూ ఇదే పరిస్థితి ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అటు రాజ్యసభ అంటూ ఇచ్చిన హామీని కూడా కాంగ్రెస్ పక్కనపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌గా ఏమీ సాధించలేక.. చేతిలో ఏ పదవీ లేక.. షర్మిల పొలిటికల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లేనా అనే అనుమానాలు కూడా కొందరిలో వినిపిస్తున్నాయ్.