YS SHARMILA: షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు.. షర్మిల కొడుకు లవ్ మ్యారేజ్!? అమ్మాయి బ్యాగ్రౌండ్ ఏంటంటే..
షర్మిల కొడుకు రాజారెడ్డి ఫారెన్‌లోనే చదువుకుంటున్నాడు. అక్కడే తనతో చదువుకునే ప్రియా అట్లూరి అనే అమ్మాయితో రాజారెడ్డి ప్రేమలో పడ్డాడట. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ప్రేమ పక్షులు.. పెద్దల ఇష్టంతో త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది.
YS SHARMILA: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. త్వరలోనే ఆమె కొడుకు వైఎస్ రాజారెడ్డి పెళ్లి జరగబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే ప్రారంభించినట్టు టాక్. షర్మిల కొడుకు రాజారెడ్డి ఫారెన్‌లోనే చదువుకుంటున్నాడు. అక్కడే తనతో చదువుకునే ప్రియా అట్లూరి అనే అమ్మాయితో రాజారెడ్డి ప్రేమలో పడ్డాడట. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ప్రేమ పక్షులు.. పెద్దల ఇష్టంతో త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది.
KCR Pragati Bhavan : సున్నాలేస్తున్నారంటగా.. KCR ప్రగతి భవన్ ఖాళీ చేస్తున్నారా ?
చాలా కాలం నుంచి అమెరికాలో ఉంటున్న ప్రియకు అక్కడి పౌరసత్వం కూడా ఉందట. ప్రస్తుతం ఆమె అక్కడే సెటిల్ అయ్యారు. పెళ్లి తరువాత షర్మిల కొడుకు కూడా అక్కడే సెటిల్ అయ్యే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ అన్నింటికంటే ముఖ్య విషయం ఏంటి అంటే.. ప్రియ కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ఏపీలో రాజకీయంగా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు బద్ధ శతృవులు. ఈ పోరు కొన్నేళ్ల నుంచీ కొనసాగుతోంది. ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా షర్మిల ఇంట్లోకే కమ్మ సామాజికవర్గానికి చెందిన అమ్మాయి కోడలుగా రావడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. వీళ్ల పెళ్లితో రాజకీయ మార్పులు కూడా వచ్చే అవకాశముంది.
అయితే ఈ విషయంలో షర్మిల కుటుంబం నుంచి కానీ.. ప్రియ కుటుంబం నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ రాజారెడ్డి, ప్రియ ఫొటోలు మాత్రం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. విషయం బయటికి చెప్పకపోయినా పెళ్లి పనులు మాత్రం ఫాస్ట్‌గా జరుగుతున్నాయనే టాక్ నడుస్తోంది. మరి కొడుకు పెళ్లి విషయాన్ని షర్మిల ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.