YS SHARMILA: కాంగ్రెస్‌లో విలీనం లేకపోతే.. షర్మిల అడుగులు ఎటువైపు..
నాన్న ఆశయాలు నెరవేరుస్తాం అని తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిలకు.. గట్టిగా లెక్కేస్తే ఆనందం రెండు మూడు రోజులు కూడా నిలవలేదు. పార్టీ పెడితే వైఎస్ కుటుంబం సానుభూతిపరులు, వైఎస్ అభిమానులు తన ఆఫీస్‌కు క్యూ కడుతూ వస్తారని బహుశా చాలా కలలు కని ఉంటారు షర్మిల.
YS SHARMILA: ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని’..! రాజకీయాలకు పక్కాగా సరిపోయే మాట ఇది. రాజకీయాల్లో.. మరీ ముఖ్యంగా షర్మిల పార్టీకి అతికినట్లు సరిపోయే డైలాగ్ ఇది. నాన్న ఆశయాలు నెరవేరుస్తాం అని తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిలకు.. గట్టిగా లెక్కేస్తే ఆనందం రెండు మూడు రోజులు కూడా నిలవలేదు. పార్టీ పెడితే వైఎస్ కుటుంబం సానుభూతిపరులు, వైఎస్ అభిమానులు తన ఆఫీస్‌కు క్యూ కడుతూ వస్తారని బహుశా చాలా కలలు కని ఉంటారు షర్మిల.
కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్. వచ్చిందే నలుగురైదుగురు. వాళ్లు కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. దీంతో ఇక లాభం లేదు అనుకొని.. గో విత్ ఫ్లో అని.. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేయాలని ఫిక్స్ అయ్యారు. బెంగళూరులో డీకేతో.. ఢిల్లీలో సోనియా, రాహుల్‌తో భేటీ కూడా అయ్యారు. లైన్ క్లియర్ చేయించుకున్నారు. ఇక విలీనం మాత్రమే బ్యాలెన్స్ అనుకుంటున్న సమయంలో.. తెలంగాణ నేతలు అడ్డుపడ్డారు. దీంతో డైలీ సీరియల్‌లా విలీనం ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. దీంతో ఈ సాగదీతకు బ్రేక్ పెట్టాలని షర్మిల ఫిక్స్ అయ్యారు. 30లోపు.. విలీనంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది.. అసలు విలీనం జరగకపోతే ఏంటి అన్నదే ఇప్పుడు అసలు సమస్య.
తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించడానికి కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. దీంతో షర్మిల మీద ఒత్తిడి పెరుగుతోంది. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని.. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల పట్టుదలతో ఉన్నారు. ఐతే సరైన హామీ లభించకపోవడంతో.. ప్రస్తుతం ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై తర్జనభజన పడుతున్నారు. ఐతే కాంగ్రెస్‌లో విలీన ప్రక్రియ లేకపోతే.. వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీకి దిగబోతున్నట్లు షర్మిల ప్రకటించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించారు. విలీనం లేకపోతే.. ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తోంది. పొత్తు ఉంటే ఇలా.. లేకపోతే అలా అంటూ.. రకరకాల ప్లాన్లు వేస్తున్నారు షర్మిల.
ఒంటరిగా పోటీ చేస్తే.. అక్టోబర్ రెండో వారం నుంచి జనాల మధ్య ఉండేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. వైటీపీకి అంత సీన్ ఉందా.. లేదా అన్నదే మ్యాటర్ ఇక్కడ. వైటీపీకి ఉన్న బలం అంతంత మాత్రమే. బలమైన నాయకులు పెద్దగా లేరు. అయినా షర్మిల మాత్రం.. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోతే సొంతంగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని గంభీరంగా ప్రకటనలు చేస్తుండడం ఆ పార్టీ నాయకులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.