YS Sharmila: భర్త అనిల్‌తో కలిసి ఢిల్లీలో షర్మిల.. విలీనానికి ముహూర్తం ఫిక్స్ అయిందా..?
షర్మిల ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ టూర్‌కు సంబంధించిన వివరాలను ఆమె చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో షర్మిల, ఆమె భర్త అనిల్ భేటీ అయ్యారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారని సమాచారం.
YS Sharmila: కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ వైటీపీ విలీనం వ్యవహారం డెయిలీ సీరియల్‌ను తలపిస్తోంది. ఎటూ తెగడం లేదు. ఎంతకీ క్లారిటీ రావడం లేదు. ఇలాంటి పరిణామాల మధ్య షర్మిల ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ టూర్‌కు సంబంధించిన వివరాలను ఆమె చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో షర్మిల, ఆమె భర్త అనిల్ భేటీ అయ్యారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారని సమాచారం. ఢిల్లీ వెళ్లే ముందు షర్మిల బెంగళూరులో 2 రోజులపాటు ఉన్నారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో చర్చలు జరిపారు. ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలతోనూ నేరుగా మంతనాలు జరుపుతున్నారని టాక్. కాంగ్రెస్‌లో పార్టీ విలీనానికి సంబంధించి దాదాపు క్లారిటీ వచ్చేసిందని, ఇంకొన్ని రోజుల్లోనే విలీనానికి సంబంధించి ప్రకటన బయటకు వస్తుందని అంటున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత షర్మిల వ్యూహం మార్చారు. కాంగ్రెస్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు. డీకే శివకుమార్ పుట్టిన రోజున షర్మిల ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మరోసారి డీకేతో భేటీ అయ్యారు. అప్పటి నుంచే ఆమె హస్తం పార్టీకి దగ్గరవుతున్నారని తేలిపోయింది. దీంతో కాంగ్రెస్‌లో వైటీపీని విలీనం చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఆ వార్తలను సున్నితంగానే ఖండించారు. ఇప్పుడు నేరుగా ఢిల్లీ పెద్దలనే కలవడం ఆసక్తికరంగా మారింది. వైటీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని సమాచారం. రాజన్న బిడ్డను అంటూ తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల.. పార్టీకి బూస్ట్ తెచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది.
ఐతే ఏదీ సక్సెస్ కాలేదు. పార్టీ నుంచి పోయే వాళ్లే తప్ప వచ్చే వాళ్లు లేరు అన్నట్లుగా పరిస్థితి కనిపించింది. తెలంగాణలో వైటీపీ ఎలాంటి ప్రభావం చూపించడంలేదని షర్మిల కూడా ఓ అంచనాకు వచ్చినట్లు కనిపిస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌లో విలీనానికి సంబంధించి వేగంగా అడుగులు వేస్తున్నారు. మరి కాంగ్రెస్‌లో షర్మిలకు ఎలాంటి స్థానం కల్పిస్తారు అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఆమె మాత్రం వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. మరి షర్మిల తెలంగాణ నుంచి పోటీ చేస్తారా..? ఏపీ బాధ్యతలు తీసుకుంటారా..? అసలు పార్టీ విలీనం ఎప్పుడు ఉంటుంది..? అన్నది ఆసక్తికరంగా మారింది.