YS SHARMILA: పార్టీ లేక.. కాంగ్రెస్‌ పట్టించుకోక.. షర్మిల నెక్ట్స్ ఏంటి ?

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆమెను అస్సలు పట్టించుకోవట్లేదు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత మీడియా ముందుకొచ్చి.. కేసీఆర్ కోసం ఓ సూట్ కేసు గిఫ్ట్‌గా పంపించి కలకలం రేపారు షర్మిల. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆమె ట్విట్టర్‌తోనే కాలక్షేపం చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 8, 2023 | 06:18 PMLast Updated on: Dec 08, 2023 | 6:18 PM

Ys Sharmilaysrtpcongressrevanth Reddy

YS SHARMILA: చిలకా ఏ తోడు లేక.. ఎటు వైపమ్మా ఒంటరి నడక అని ఓ పాటలో లిరిక్స్ ఉంటాయ్. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ పాత్ర చిక్కుకున్నప్పుడు.. వచ్చే పాట ఇది. ఇప్పుడు షర్మిలకు కూడా ఇదే లిరిక్స్‌ పక్కాగా సరిపోయేలా కనిపిస్తున్నాయ్. తెలంగాణ ఆడబిడ్డగా రాజన్న రాజ్యం తీసుకువస్తానని పార్టీ పెట్టిన షర్మిల.. దాదాపు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కిలోమీటర్లకు కిలోమీటర్లకు నడవడంతో అలసట వచ్చిందేమో కానీ.. పాదయాత్రతో పార్టీకి ఏ మాత్రం మైలేజ్ రాలేదు. దీంతో కాంగ్రెస్‌లో వైటీపీని కలిపేందుకు చాలా ప్రయత్నాలు చేశారు షర్మిల.

REVANTH REDDY: రేవంత్ దర్బార్.. సీఎం ప్లాన్ మామూలుగా లేదుగా..!

ఐతే అది కూడా సక్సెస్‌ కాలేదు. దీంతో ఏం చేయలేక, చేసేదేమీ లేక.. పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన షర్మిల.. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తానని ప్రకటించారు. కట్‌ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఐతే షర్మిల త్యాగాన్ని హస్తం పార్టీ నేతలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. దీంతో షర్మిల రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆమెను అస్సలు పట్టించుకోవట్లేదు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత మీడియా ముందుకొచ్చి.. కేసీఆర్ కోసం ఓ సూట్ కేసు గిఫ్ట్‌గా పంపించి కలకలం రేపారు షర్మిల. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆమె ట్విట్టర్‌తోనే కాలక్షేపం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత వరుస ట్వీట్లు వేశారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ వేశారు. తెలంగాణ జనాల చారిత్రక తీర్పు అద్భుతం అన్నారు. సుపరిపాలనకు నాంది అని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ ట్వీట్‌లో మొదటిసారి ఆమె రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించారు. ఇదంతా ఎలా ఉన్నా.. షర్మిల ట్వీట్‌ని కాంగ్రెస్ స్వాగతించలేదు. హస్తం పార్టీ నేతలెవరూ పట్టించుకోలేదు.

పైగా సోషల్ మీడియాలో షర్మిల మీద విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. అసలు పార్టీ ఎందుకు పెట్టావ్, పాదయాత్ర ఎందుకు చేశావ్, అనుచరుల డబ్బులు ఎందుకు ఖర్చు చేశావ్, చివరకు పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నావ్.. అంటూ కౌంటర్లిస్తున్నారు నెటిజన్లు. ఇక అటు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరిని.. కాంగ్రెస్ ఏదో విధంగా అకామిడేట్ చేస్తోంది. కోదండరాంకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేందుకు సిద్ధం అయింది. సీపీఐకి ఓ ఎమ్మెల్యే సీటు, రెండు ఎమ్మెల్సీలు ఇస్తోంది. మరి షర్మిల పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఏ రేవంత్‌ మీద పరోక్షంగా, ప్రత్యక్షంగా ఇన్నాళ్లు షర్మిల కామెంట్లు చేశారో.. ఇప్పుడు అదే రేవంత్ నిర్ణయం మీద షర్మిల రాజకీయ భవిష్యత్ ఆధారపడిన పరిస్థితి కనిపిస్తోంది.