పవన్ ప్లీజ్ కామెడి ఆపు: జగన్ సెటైర్లు
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు జగన్. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తోందన్న ఆయన మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మనం రేపు మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు.
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు జగన్. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తోందన్న ఆయన మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మనం రేపు మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు.
ప్రతినెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రేషన్ బియ్యం వ్యవహారంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని అసలు అధికారంలో ఎవరున్నారు అని సందేహం వస్తోంది అన్నారు. రాష్ట్రంలో అధికారం మారి 7 నెలలు అయ్యిందని మంత్రులు వాల్లే, అధికారులు వాళ్ల మనుషులే, చివరకు చెక్‌పోస్టులు వాళ్లు పెట్టినవే ఉన్నాయన్నారు. కాకినాడ పోర్టులో కస్టమ్స్ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్లే అని అటు కేంద్రంలోనూ వాళ్లే ఉన్నారు, రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారన్నారు.
మరి ఎవరిమీద నిందలు వేస్తారు? ఎవరిమీద దుష్ప్రచారం చేస్తారు? అని జగన్ నిలదీశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతిచేస్తున్నారని కాని ఆ షిప్ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదన్ని మండిపడ్డారు. బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్ వన్ అన్ని దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడ నుంచే జరుగుతున్నాయన్నారు. పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నంబర్ వన్ అని జగన్ మండిపడ్డారు. మరి వ్యవస్థీకృత నేరాలు ఎవరు చేస్తున్నారు అని నిలదీశారు.
అదనంగా పండించే బియ్యాన్ని ఎగుమతి చేయడంలో తప్పులేదని… కాని దీన్ని ఇప్పుడు ట్విస్ట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మన ప్రభుత్వం హయాంలో డీలర్ల వద్ద తప్పులు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తే , దాన్ని పక్కనపెట్టామన్నారు. నేరుగా వాహనాల ద్వారా లబ్ధిదారులకు అందించామన్నారు. స్వర్ణ రకం తినగలిగే బియ్యాన్ని అందించామని సార్టెక్స్ చేసిన మరీ ఇచ్చామన్నారు. రేషన్ బియ్యం దుర్వినియోగానికి పుల్‌స్టాప్ పెట్టింది మనమే అని ఆయన స్పష్టం చేసారు. కాని మళ్లీ ఈ ప్రభుత్వంలో అన్ని పద్దతులూ మార్చారన్నారు. మళ్లీ డీలర్లకు అన్నీ అప్పగించారని సార్టెక్స్ బియ్యాన్ని ఇవ్వడం లేదని ఆరోపించారు.