రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తిరుపతి లో తొక్కిసలాట చరిత్ర లో ఎన్నడూ జరగలేదన్నారు. భక్తుల భద్రత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టదా? అంటూ ప్రశ్నించారు. పోలీసులంతా చంద్రబాబు పర్యటన లో నిమగ్నమయ్యారని భక్తుల భద్రతను చంద్రబాబు గాలికి వదిలేసారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికార యంత్రాంగం పై పట్టులేదని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ పదుల సంఖ్యలో హిందువులు మృతి చెందుతున్నారని సనాతన ధర్మం ప్రతినిధి అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత వహించరు అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ క్షమాపణలతో పోయిన ప్రాణాలు వస్తాయా? అని నిలదీశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో తిరుపతి లో తొక్కిసలాట ఘటన జరగలేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసారు. దేవాదాయ శాఖ మంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలని పవన్ కళ్యాణ్ పదేపదే మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేసారు. పవన్ కళ్యాణ్ మగాడివైతే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మాట్లాడాలన్నారు. పోలీసుల బలగాలన్నీ కుప్పం ముఖ్యమంత్రి పర్యటనకు.. బాలకృష్ణ డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వెళ్లాయని.. తిరుపతి కు వచ్చే భక్తుల భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన ఆరోపించారు. [embed]https://www.youtube.com/watch?v=CZ-K4_rsMHc[/embed]