జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదానికి కారణం చంద్రబాబు
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికలో వైసిపి ఓటమి చెందినా జగన్ వ్యక్తిగత జీవితం పైన దాడులు జరుగుతున్నాయని ఎప్పుడో విజయమ్మ కారు టైరు పగిలితే జగన్ హత్య చేయాలని చూశాడు అని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికలో వైసిపి ఓటమి చెందినా జగన్ వ్యక్తిగత జీవితం పైన దాడులు జరుగుతున్నాయని ఎప్పుడో విజయమ్మ కారు టైరు పగిలితే జగన్ హత్య చేయాలని చూశాడు అని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పై అనేక సంఘటనలు సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఎన్టీఆర్ మరణానికి ఎవరు కారణం,హరికృష్ణ,జూనియర్ ఎన్టీఆర్,రామకృష్ణల కారు ప్రమాదానికి కారణం ఎవరు అని నిలదీశారు. ముఖ్యమంత్రికి చెల్లెళ్ళు ఎంతమందు ఉన్నారు,ఎంత ఆస్తి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. తమ్ముడు రామూర్తి నాయుడు ఎక్కడున్నాడు అతనికి ఎంత అస్తి ఇచ్చారు, చంద్రబాబు తల్లిదండ్రులు మరణిస్తే వారికి కొడుకుగా తలకొరివి కూడా పెట్టలేదంట అని విమర్శించారు. ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 78 మంది మహిళలు మరణించారన్నారు.